Ind vs Ban Champions Trophy 2025 : బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. నెట్స్‌లో ప్లేయర్ల ప్రాక్టీస్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వయంగా పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా జడ్డూతో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇక చివర్లో అతడిని ఓసారి హగ్ చేసుకున్నాడు. దీంతో అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేవంటూ ప్రచారం సాగుతోంది.
కాగా, ఈ ఆసక్తికర పరిణామంపై అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను సంప్రదించింది. బంగ్లాదేశ్‌తో తలపడే తుది జట్టులో 'జడేజా ఆడడం లేదా?' అని ప్రశ్నించింది. దీనికి అతడు స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలన్నది టీమ్ఇండియా వ్యూహమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే జడేజా జట్టులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో ఆడే ఇద్దరు స్పిన్నర్లలో అక్షర్, కుల్దీప్ స్థానాలు దాదాపు ఖాయమన్నాడు.
వాళ్లిద్దరూ ఫిట్
సీనియర్ పేసర్ షమీ, కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఫిచ్గా ఉన్నారని రోహిత్ శర్మ ధ్రువీకరించారు. 'షమీ బౌలింగ్ ఫిట్‌నెస్ బాగుంది. కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఏదైనాకానీ, ఇప్పటివరకు పర్ఫెక్ట్‌గానే ఉన్నాడు. అతడు కొన్నేళ్లుగా టీమ్ఇండియా బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు రిథమ్ అందుకుంటాడని ఆశిస్తున్నా. కుల్దీప్ హెర్నియా ఆపరేషన్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఇక ఇద్దరూ ఆడితే మాకు చాలా మంచిది' అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక వన్డేల్లో విజయాలు సాధించాలంటే టాపార్డర్ బ్యాటర్లు రాణించడం ముఖ్యమని రోహిత్ అన్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), తంజిద్, సౌమ్య సర్కార్, హృదాయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, మెహిదీ మిరాజ్, రిషాద్ హొసేన్, తస్కిన్, ముస్తాఫిజుర్, నహిద్ రాణా
Captain Rohit Sharma and coach Gautam Gambhir having discussion with Ravindra Jadeja.👀 pic.twitter.com/5364t8bjvk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 19, 2025
తొలి మ్యాచ్‌కు టీమ్ఇండియా సై- రికార్డులన్నీ మనవైపే!
ఛాంపియన్స్ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?