ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం - సౌరభ్ చౌదరి
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత జంట బంగారు పతకం సాధించింది.
ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం
దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్ మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సౌరభ్ చౌదరి, మనూ బాకర్ జంట స్వర్ణం గెలుపొందింది.
ఇరాన్ జంట గోల్నౌష్ సెభతోల్లాహి-జావెద్ ఫోరోగిపై భారత్ జోడీ విజయం సాధించింది. ఈ పతకంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్ పొందిన మొత్తం గోల్డ్ మెడళ్ల సంఖ్య ఐదుకు చేరింది.
ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం