ETV Bharat / state

'ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు' - ఆర్థిక సాయంపై కూటమి నేతల హర్షం - LEADERS REACT ON STEEL PLANT

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కృషితోనే సాధ్యమైందన్న నేతలు - స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి

Coalition Leaders Reacts On Visakha Steel Plant
Coalition Leaders Reacts On Visakha Steel Plant (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 8:42 PM IST

Coalition Leaders Reacts On Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొత్త జవసత్త్వాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇంధనాన్ని అందించడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న మాటే ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక వెసులుబాటును స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టుగా NDA ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడంపై విశాఖ ఎంపీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలోనూ చంద్రబాబు అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌తో చర్చించి స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు ఇప్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్​ ప్లాంట్​కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చరిత్రను తిరగరాసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని జనసేన ఎమ్మెల్యేలు అన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఉక్కు కార్మికులు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధాని మోదీ అందించిన ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు.

7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు - ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు

లక్షన్నర కోట్ల పెట్టుబడి - 63వేల ఉద్యోగావకాశాలు - ఏపీలో ఆర్సెలార్‌ మిత్తల్ స్టీల్ ప్లాంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.