ETV Bharat / business

సొంత వ్యాపారానికి పెట్టుబడి కావాలా? మహిళల కోసం టాప్-6 గవర్నమెంట్ స్కీమ్స్ ఇవే! - LOAN FOR WOMEN ENTREPRENEURS

మహిళా పారిశ్రామికవేత్తలుగా కావాలనుకుంటున్నారా? మరి మీకు ఈ ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?

Government Loan For Women Entrepreneurs
Government Loan For Women Entrepreneurs (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 1:54 PM IST

Government Loan For Women Entrepreneurs : మహిళా సాధికారత సాధించడమే ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా వారు ఆర్థికంగా ఎదగడానికి పలు పథకాలను సైతం ప్రవేశపెడుతున్నాయి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు పలు పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. మరి అలాంటి 6 పథకాల్ని ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

1. అన్నపూర్ణ పథకం
Annapurna scheme : ఈ జాబితాలో మొదట మనం చెప్పుకోవాల్సింది అన్నపూర్ణ పథకం గురించి. ఇది ఫుడ్, క్యాటరింగ్ వ్యాపారాలపై ఆసక్తి ఉన్న మహిళలకు చాలా ఉపయోగకరం. ఈ పథకం ప్రకారం రూ.50వేల వరకు రుణం తీసుకోవచ్చు. 36 వాయిదాలలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం ఏదైనా ఆస్తి, భూమి పేపర్లు పూచీకత్తుగా ఇవ్వాల్సి ఉంటుంది.

2. ముద్ర యోజన
Mudra Yojana : ముద్రా యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం. ఏదైనా సంస్థలు స్థాపించి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఆర్థిక సాయం అందిచండానికి ప్రారంభించారు. ముద్ర లోన్‌ కింద ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. దీనికి ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. రుణం పొందడానికి కావాల్సిన అర్హతలు కూలా సులువే.

3. స్టాండప్‌ ఇండియా
Stand Up India scheme : స్టాండప్ ఇండియా అనే పథకం ప్రధానంగా ఎస్​సీ, ఎస్​టీ మహిళల కోసం కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది. తయారీ, సేవలు, వాణిజ్యం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్తిగా నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి బ్యాంకు లోన్ల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ పథకం కింద ఒక్క మహిళకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణం ఇస్తారు. ఒకరి కంటే ఎక్కువ మహిళలు గ్రూప్‌గా ఏర్పడితే అందులో కనీసం 51 శాతం షేర్‌ మహిళలు కానీ, ఎస్​సీ, ఎస్​టీ వారికి ఉండాలి.

4. మహిళా శక్తి యోజన
Stree Shakti Yojana : మహిళా శక్తి యోజన అనేది వ్యాపారం చేయాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూపొందించిన పథకం. కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో దీన్ని ప్రారంభించింది. దీని ప్రకారం రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ తీసుకున్న రుణాలపై 0.05 శాతం రాయితీ పొందవచ్చు. అయితే పథకాన్ని పొందేందుకు EDP లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి.

5. సెంటి కల్యాణి పథకం
Cent Kalyani Scheme : ఇండియాలోని మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌ ఇండియా పథకం కింద, సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఈ పథకాన్ని తీసుకువచ్చింది. MSME చట్టం 2006 ప్రకారం సూక్ష్మ లేదా చిన్న సంస్థలను కలిగి ఉన్న వారు లేదా కొత్తగా వాటిని స్థాపించాలనుకునే వారికి ప్రోత్సాహం అందిస్తుంది.

6. ఉద్యోగిని
Udyogini Scheme : ఉద్యోగిని పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను, ఆర్థికాభివృద్ధి సాధించాలనుకునే మహిళలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ప్రకారం వార్షికాదాయం రూ.40 వేల లోపు ఉన్న మహిళలు రూ.లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. ఇతర సంస్థలు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ఈ పథకం చాలా తక్కువ వడ్డీ రేట్లకు రుణం అందిస్తుంది.

దేశంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు, వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తీసుకొచ్చిన పథకాలివీ. ప్రభుత్వం తీసుకున్న ఒక ముందడుగు. అలాంటి ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల ద్వారా లబ్ది పొందవచ్చు.

నోట్ : రుణం తీసుకోవడం అనేది రిస్కుతో కూడుకున్న వ్యక్తిగత నిర్ణయం. రుణం తీసుకునే ముందు జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించగలరు.

పూచీకత్తు లేకుండా రూ.20కోట్ల వరకు బిజినెస్ లోన్​ - ఈ​ స్కీమ్​ గురించి మీకు తెలుసా?

మీ బిజినెస్ కోసం బ్యాంక్‌ లోన్ కావాలా? ఈ డాక్యుమెంట్స్ మస్ట్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.