Sunita Williams 9th Spacewalk: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు మరోసారి స్పేస్‌వాక్ చేయనున్నారు. ఇటీవలే జనవరి 16, 2025న ఆమె తన కెరీర్లో ఎనిమిదోసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు తన కెరీర్లో 9వ స్పేస్‌వాక్ అంటే ఎక్స్ట్రా-వెహికల్ యాక్టివిటీ (EVA) చేయబోతున్నారు. దీంతో గతేడాది జూన్‌లో ISSలోకి వచ్చినప్పటి నుంచి విలియమ్స్ స్పేస్ స్టేషన్ నుంచి వెలుపలికి రావడం ఇది రెండోసారి కానుంది.
ఆమె ఇటీవలే చేసిన 8వ స్పేస్‌వాక్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రస్తుత కమాండర్ సునీతా విలియమ్స్ తన తోటి ఆస్ట్రోనాట్, ఫ్లైట్ ఇంజనీర్ బారీ విల్మోర్తో కలిసి మరోసారి ISS నుంచి వెలుపలికి రానున్నారు. ఇది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా చేపట్టిన 92వ స్పేస్‌వాక్.
సునీత తొమ్మిదో స్పేస్‌వాక్ ప్రతక్షప్రసారం: సునీతా విలియమ్స్ తొమ్మిదోసారి చేయనున్న స్పేస్‌వాక్‌ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీంతో ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీలో ఎక్కడి నుంచైనా ఈ లైవ్ కవరేజ్‌ను వీక్షించొచ్చు. ఈ నేపథ్యంలో సునీతా స్పేస్‌వాక్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు చూడొచ్చు అనే వివరాలు తెలుసుకుందాం రండి.
సునీతా, బుచ్ విల్మోర్ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు తమ స్పేస్సూట్లను బ్యాటరీ పవర్‌కు మార్చుకోనున్నారు. అప్పుడు ఈ స్పేస్‌వాక్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దీన్ని NASA+లో ఈరోజు సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ సమయంలో లైవ్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ స్పేస్‌వాక్ ఉద్దేశం ఏంటి?: ఈ స్పేస్‌వాక్ ప్రాథమిక ఉద్దేశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటెన్నా అసెంబ్లీని తొలగించడం. దీనితో పాటు సునీతా, విల్మోర్కు ఆర్బిటల్ అవుట్‌పోస్ట్‌లో సూక్ష్మజీవులను కనుగొనే పని కూడా అప్పగించారు.
ఇదిలా ఉండగా ఇటీవలే జనవరి 16న సునీతా తన కెరీర్లో ఎనిమిదో స్పేస్‌వాక్‌ను నిర్వహించారు. ఆ స్పేస్‌వాక్ సమయంలో ఆమె తన తోటి వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ISSలోని కొన్ని ముఖ్యమైన హార్ట్వేర్లను మార్చారు. వీటితో పాటు న్యూట్రాన్ స్టార్ ఇంటీరియర్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ (NICER) ఎక్స్-రే టెలిస్కోప్‌ను కూడా రిపేర్ చేశారు.
కాగా బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీత, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ గతేడాది జూన్ 6న ISSకు చేరుకున్నారు. వాస్తవానికి దాదాపు వారం రోజుల్లో అంటే అదే నెల 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వీరిద్దరూ గత ఏడు నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే చిక్కుకుపోయారు.
ఈ నేపథ్యంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు 'స్పేస్ ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. త్వరలో ఈ పని పూర్తిచేస్తామని 'ఎక్స్'లో పోస్ట్ ద్వారా మస్క్ వెల్లడించారు.
డీప్‌సీక్‌తో మీ డేటా సేఫేనా?- దీన్ని వాడేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
ట్రంప్ సమక్షంలో స్పేస్ఎక్స్ ప్రయోగం- నింగిలోకి దూసుకెళ్లిన మస్క్ సూపర్ హెవీ రాకెట్- కానీ..!
ఇండియాకు చెందిన శాటిలైట్‌ని ప్రయోగించిన స్పేస్ఎక్స్- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే!