Ravva Punugula Recipe in Telugu : గంటల కొద్ది నానబెట్టి, ఎంతో సేపు మిక్సీపట్టి టిఫిన్లు చేయాలంటే మీ దగ్గర సమయం లేదా? అప్పటికప్పుడు రెడీమేడ్ గా పదినిమిషాల్లో మీకిష్టమైన రెసిపీ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ ఇన్స్టెంట్ రవ్వ పునుగుల రెసిపీ. ఎంతో రుచికరంగా క్రిస్పీగా తయారు చేసే ఈ పునుగులు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా!
పునుగులు చేయడానికి బియ్యం లేదా ఇడ్లీ పిండి ఉండాల్సిందే. కానీ ఎప్పుడైనా పునుగులు తినాలనిపిస్తే ఈ ఇన్స్టెంట్ రవ్వ పునుగులు ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటాయి.
రుచికరమైన హెల్తీ సొరకాయ దోశ - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
ఎక్కువ మంది రోడ్ సైడ్ ఫుడ్ ఇష్ట పడుతుంటారు. కానీ, ఇంట్లోనే అప్పటికప్పుడు రవ్వ పునుగులు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. పరిశుభ్రమైన నూనె వాడడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇన్స్టెంట్ రవ్వ పునుగులు వేసేద్దాం పదండి.
కావలసిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- బియ్యం పిండి - 1 / 2 కప్పు
- మైదా - 1 / 4 కప్పు
- ఉప్పు - 2 టీస్పూన్లు
- వంట సోడా - 1 / 2 టీస్పూన్
- ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
- పచ్చి మిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
- అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగినది)
- కరివేపాకులు - రెండు రెబ్బలు
- కొత్తిమీర - ఒక చిన్న కట్ట
- ఇంగువ - 1 / 4 టీస్పూన్
- పెరుగు - 200 గ్రాములు (చిలికినది)
- నీళ్లు - పిండి తయారీకి సరిపడా
- నూనె - వేయించడానికి సరిపడా
పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!
తయారీ విధానం :
- రవ్వ పునుగుల తయారీ కోసం 30 నిమిషాల ముందుగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కొలతల్లో సూచించిన విధంగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మైదాపిండి, ఉప్పు, వంట సోడా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి, అల్లం తరుగుతో పాటు కరివేపాకులు, కొత్తిమీర, ఇంగువ, చిలికిన పెరుగు వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఈ పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
- 30 నిమిషాల తర్వాతం కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడిచేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న సైజులోపునుగులు వేసుకోవాలి.
- పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి వేడి చేసుకోవాలి. పునుగులు అన్ని వైపులా మంచి రంగు వచ్చేలా పైకి, కిందటి తిప్పుతూ వేయించాలి. పైన కరకరలాడుడూ, లోపల మృదువుగా ఉండై ఇన్స్టెంట్ రవ్వ పునుగులు తయారైనట్టే!
అతి ప్రాచీన వంటకం 'కుంభకోణం సాంబార్' - జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే!
ఈ కిచిడీ పోషకాల గని - వారం రోజులు తింటే పూర్తి ఆరోగ్యం మీ సొంతం!