Woman Kills Young Man over Extramarital Affair in Kakinada: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ ఓ యువకుడిని తలపై బలంగా కొట్టి హతమార్చింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ చినమల్లానికి చెందిన చంద్రశేఖర్ (29) కూలి పనులు చేస్తుంటాడు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన ఓ మహిళతో గత కొంతకాలంగా చంద్రశేఖర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో వేరుగా ఉంటోంది. మహిళ గత 2 నెలల నుంచి కాకినాడ స్వర్ణాంధ్రకాలనీలోని టిడ్కో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది.
ఆ మహిళ కాకినాడలో ఉంటోందని తెలుసుకున్న చంద్రశేఖర్ నిన్న రాత్రి ఆమె ఇంటికి వచ్చాడు. ఆ మహిళ కాకినాడలో మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళ అతనిపై పప్పుగుత్తి, ఇనుపగొట్టంతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ సునీల్ ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
వీడియో కాల్ చేసి అతడు ఉరేసుకున్నాడు - ఆపై ఆమె కూడా!
పెద్దిరెడ్డి భూ దోపిడీ నిజమే - వెబ్‌ల్యాండ్ అడంగల్లోకి మంగళంపేట భూములు