ETV Bharat / sports

రోహిత్ రంజీ డెసిషన్- ఆ సిరీస్​ కంటే ముందే యాక్షన్​ మోడ్​లోకి హిట్​మ్యాన్​ - ROHIT SHARMA RANJI TROPHY

సస్పెన్స్​కు ఎండ్ కార్డ్- 10ఏళ్ల తర్వాత రంజీ బరిలో రోహిత్

Rohit Ranji Trophy
Rohit Ranji Trophy (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 18, 2025, 5:16 PM IST

Rohit Sharma Ranji Trophy : కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఆడడంపై కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిట్​మ్యాన్ రీసెంట్​గా నెట్స్​లో ప్రాక్టీస్ చేయడం వల్ల దేశవాళీలో ఆడడం పక్కా అని ప్రచారం సాగింది. ​అయితే దీనిపై రోహిత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్​ల్లో తాను బరిలో దిగుతున్నట్లు చెప్పి సస్పెన్స్​కు తెర దించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన కోసం బీసీసీఐ ముంబయిలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో రోహిత్ పాల్గొన్నాడు. జట్టు ప్రకటన అనంతరం రంజీలో ఆడే విషయంపై స్పష్టతనిచ్చాడు. 'మీరు రంజీలో ఆడుతున్నారా?' అన్న ప్రశ్నకు రోహిత్ 'యస్ రంజీలో ఆడనున్నాను' అని రిప్లై ఇచ్చాడు. టోర్నీలో ముంబయి తరఫున రోహిత్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఆ సిరీస్​ కంటే ముందే
ఈ నెల 23న కశ్మీర్ జట్టుతో ముంబయి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​లోనే రోహిత్​ బరిలో దిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ కంటే ముందే రోహిత్​ బ్యాటింగ్ చూడవచ్చు. ఈ సిరీస్​కు రంజీ మ్యాచ్​ ప్రాక్టీస్​లాగానూ రోహిత్​కు ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్, రంజీల్లో పాల్గొని కమ్​బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మరోవైపు ఆటగాళ్లందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ పెట్టడం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. అయితే రోహిత్ 2015లో చివరిసారిగా రంజీ మ్యాచ్​ ఆడాడు.

నెట్స్​లో రోహిత్
రంజీ కోసం రోహిత్ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రీసెంట్​గా నెట్స్​లో తీవ్రంగా శ్రమించాడు. కవర్ డ్రైవ్, కట్ షాట్, పుల్ షాట్ తదితర షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్​ చేశాడు. అలాగే హిట్ షాట్లు, భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. అదే విధంగా ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ఫుట్ వర్క్​పై ఎక్కువగా దృష్టిపెట్టాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో అకౌంట్​లో షేర్ చేశాడు.

కమ్​బ్యాక్​పై రోహిత్ ఫోకస్- నెట్స్ ప్రాక్టీస్ షురూ- వీడియో వైరల్

రోహిత్, విరాట్ చూపు రంజీ వైపు- కుర్రాళ్లుకూడా ఈ రూటు లోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.