Karun Nair Champions Trophy 2025 : 7 ఇన్నింగ్స్ ల్లో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ. 752 పరుగులు. విజయ్ హజారే ట్రోఫీలో భారత ఆటగాడు కరుణ్ నాయర్ సాధించిన ఘనత ఇది. వరుసగా సెంచరీల మోత మోగించిన కరుణ్ నాయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవ్వడం పక్కా అని అందరూ భావించారు. తీరా చూస్తే షాక్. కరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీనే కాదు, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. అతడికి మళ్లీ నిరాశే ఎదురైంది.
9 ఏళ్ల తర్వాత టీమ్ఇండియాలో రీఎంట్రీ ఇవ్వాలనే కరుణ్ నాయర్ ఆశ నెరవేరలేదు. కరుణ్ చివరిసారిగా 2016లో భారత వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే టీమ్ఇండియా తరపున 6 టెస్టులు ఆడాడు. అందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడు. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు.
అందులో అదుర్స్
తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 752 రన్స్ బాదాడు. అందులో 5 సెంచరీలు, ఒక అర్ధశతకం ఉండడం గమనార్హం. అంతలా విధ్వంసం సృష్టించాడు కరుణ్ నాయర్. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ అతడికి మళ్లీ నిరాశే ఎదురైంది. అలాగే టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా మొండిచెయ్యి ఎదురైంది.
అగార్కర్ వివరణ
కాగా, కరుణ్ నాయర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ కనబరిచిన ప్రదర్శనను కొనియాడాడు. జట్టు ఎంపిక గురించి చర్చించినప్పుడు నాయర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నాడు.
'విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మేం అతడి గురించి చర్చించాం. 700కు పైగా పరుగులు చేయడం అంటే మాములు విషయం కాదు. అది ప్రత్యేకమైన ప్రదర్శన. కానీ, ఇది 15 మందితో కూడిన జట్టు మాత్రమే. కాబట్టి ప్రస్తుత జట్టులో ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం కష్టం. ఒకవేళ ఎవరైన గాయపడితే అప్పుడు కరుణ్ నాయర్ పేరును పరిశీలిస్తాం' అని అగార్కర్ పేర్కొన్నాడు.
'నా కమ్‌బ్యాక్ ఫార్ములా అదే, ఈసారి రీ ఎంట్రీ పక్కా!'- కరుణ్ నాయర్
'కోహ్లీలా టాటూలు వేసుకోలేదని అతడ్ని పక్కన పెట్టారా?' : బీసీసీఐపై మాజీ క్రికెటర్ ఫైర్