ETV Bharat / sports

సిరీస్​పై ధావన్​సేన కన్ను.. గెలుపు కోసం లంక ఆరాటం - prithvi shaw

శ్రీలంకతో జరుగుతోన్న టీ20 సిరీస్​ను విజయంతో ప్రారంభంచింది టీమ్ఇండియా. ఇదే ఉత్సాహంతో రెండో మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను సొంతం చేసుకోవాలని గబ్బర్​ సేన సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను చేజార్చుకున్న లంక జట్టు ఎలాగైనా టీ20 సిరీస్​లో పైచేయి సాధించాలని చూస్తోంది.

IND Vs SL 2nd T20I: Time for Samson to fire as India aim to wrap up series
ఇండియా Vs శ్రీలంక 2వ టీ20
author img

By

Published : Jul 27, 2021, 5:34 AM IST

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయబావుటా ఎగురవేసిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్​లోనూ సత్తా చాటాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్​ కోల్పోయిన లంక జట్టు.. టీ20 ఫార్మాట్​లోనైనా తమను తాము నిరూపించుకోవాలని చూస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్​లో గెలుపు కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి.

మనీశ్​కు నిరాశే!

ఇంగ్లాండ్​ పర్యటన కోసం వెళ్లాల్సిన టీమ్ఇండియా బ్యాట్స్​మెన్​ పృథ్వీషా, సూర్యకుమార్​ యాదవ్​లకు విశ్రాంతి ఇస్తే తప్ప మిగిలిన పరిస్థితుల్లో జట్టులో మార్పులు చేసే అవకాశం లేదనే చెప్పాలి. ఒకవేళ భారత జట్టు యాజమాన్యానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉంటే దేవ్​దత్​ పడిక్కల్​, రుతురాజ్​ గైక్వాడ్​ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్సు ఉంది. మనీశ్​ పాండేకు రెండో టీ20లో తుదిజట్టులో అవకాశం రాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న బౌలింగ్​ లైనప్​లో ఎలాంటి మార్పులు ఉండకపొవచ్చు. వైస్​కెప్టెన్​ భువనేశ్వర్​ సహా ఇతర బౌలర్లు చాహల్​, చాహర్​ వంటి వారు వికెట్లు పడగొడుతూ ఆకట్టుకుంటున్నారు. కానీ, హార్దిక్​ పాండ్యా ప్రదర్శన జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది.

బౌలర్లు సత్తా చాటినా..

భారత్​తో తొలి టీ20లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 126 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్​లో లంక బ్యాట్స్​మన్​ అవిష్క ఫెర్నాండో, చరిత్​ అసలంక తప్ప మిగిలిన వారెంవ్వరూ ఆకట్టుకనే ప్రదర్శన చేయలేకపోయారు. తొలుత శ్రీలంక బౌలర్లు టీమ్ఇండియా బ్యాట్స్​మెన్​ను కట్టడి చేసిన.. లక్ష్యాన్ని ఛేదించడంలో లంక బ్యాట్స్​మెన్​ మాత్రం చేతులెత్తేశారు. అయితే లంక జట్టులోని యువ క్రికెటర్ల ప్రదర్శన అటు ఇటుగా అనిపించినా.. రెండో టీ20కి జట్టులో మార్పు చేసే అవకాశం లేదు.

తుదిజట్లు(అంచనా)..

భారత్​: శిఖర్ ధావన్​(కెప్టెన్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, హర్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, కృనాల్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్.

శ్రీలంక: దసున్ శనక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, వానిందు హసరంగ, చమీక కరుణరత్నే, అకిల ధనంజయ, దుశ్మంత చమీరా, బండారా.

ఇదీ చూడండి.. లంకలో అదుర్స్.. ఇంగ్లాండ్​ పర్యటనకు​ సూర్యకుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.