ETV Bharat / international

కష్టపడకుండా బరువు తగ్గాలా? అయితే ఇది మీకోసమే - రాత్రి భోజనం

పూర్తిగా కడుపు మాడ్చుకుని, అదే పనిగా వ్యాయామం చేస్తే సన్నబడతారనేది చాలా మంది అభిప్రాయం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు కానీ అది లేనిపోని సమస్యలకు దారితీస్తుంది. అయితే ఓ చిట్కా పాటించడం వల్ల సన్నబడొచ్చని చెబుతుందో అధ్యయనం. అందేంటో తెలుసుకుందామా?

Meal timings also count in weight loss
కష్టపడకుండా బరువు తగ్గాలా? అయితే ఇది మీకోసమే
author img

By

Published : Mar 16, 2020, 2:40 PM IST

ఊబకాయం.. యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు ఇప్పుడిదో పెద్ద సమస్య. నాజూగ్గా కనిపించాలని చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే కొన్ని పనులు లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. అయితే ఓ చిట్కా పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోందీ అధ్యయనం.

కెవిన్​ కెల్లీ, ఓవెన్​ మైక్​గెన్నీస్​, కార్ల్​ జాన్సన్​, వండర్​బిల్ట్​ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది కలసి ఈ అధ్యయనం చేశారు. 'పీఎల్​ఓఎస్​ బయోలజీ' అనే జర్నల్​లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఇదే ప్రధానం..

రోజూ మనం ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నామనేది ముఖ్యం కాదు ఏ సమయంలో తింటున్నామనేది ప్రధానమని ఈ అధ్యయనం చెబుతోంది.

ఈ మూడింటిపై...

సాధారణంగా బరువు పెరగడం, తగ్గడం అనేది ఈ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది.

ఏం తింటున్నాం?

ఎంత తింటున్నాం?

ఎంత సమయం వ్యాయామం చేస్తున్నాం?

మీరు తినే ఆహారం ఏ మేరకు జీర్ణం అవుతుంది అనేది రోజువారీ దినచర్య, నిద్రపోయే సమయాలపై ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది.

సర్వే చేశారిలా

'రేండమ్​ క్రాస్​ఓవర్​' అనే ప్రయోగం ద్వారా మధ్య వయస్కులు, పెద్దల జీవక్రియను వేర్వేరుగా 56 గంటల పాటు రెండు సెషన్స్​లో పర్యవేక్షించారు.

ప్రతి సెషన్​లో వీరికి మధ్యాహ్నం 12:30కు లంచ్​, సాయంత్రం 5:45కు రాత్రి భోజనాన్ని అందించారు. అయితే మూడో భోజనం ఈ రెండు సమయాలకు భిన్నంగా అందించారు.

మొదటి 56 గంటల్లో 8 గంటలకు అల్పాహారం, రాత్రి 10 గంటలకు చిరుతిళ్లను అందించారు. రాత్రి సమయాల్లో చిరుతిళ్లు తీసుకోవడం వల్ల బరువు పెరగడం అధికంగా ఉంటుందని వీరు గుర్తించారు. అదే ఉదయం పూట అల్పాహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుందని పేర్కొన్నారు.

రాత్రి భోజనం, ఉదయం అల్పాహారానికి మధ్య ఏం తీసుకోకుండా ఉంటే బరువు తగ్గే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​లో నలుగురు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.