బావిలో పడ్డ చిరుత, పిల్లి.. అధికారుల చొరవతో సేఫ్గా.. - మహారాష్ట్ర నాసిక్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర.. నాసిక్ సమీపంలోని అషాపుర్ గ్రామంలో బావిలో పడిన చిరుతపులి, పిల్లిని అటవీశాఖ సిబ్బంది రక్షించారు. ఫిబ్రవరి 14న ఉదయం ప్రమాదవశాత్తూ చిరుత, ఒక పిల్లి బావిలో పడిపోయాయి. బావిలో సగానికిపైగా నీళ్లుండగా పైకి వచ్చేందుకు ఆ రెండూ చేసిన ప్రయత్నం ఫలించలేదు. బావి మధ్యలో రెండు కర్రలు ఉండగా చిరుత వాటిపైకి చేరింది. చిరుతపైకి ఎక్కి బయటపడేందుకు పిల్లి ప్రయత్నించినా బావి ఎత్తుగా ఉండడం వల్ల సాధ్యంకాలేదు. గ్రామానికి చెందిన రైతు వాటిని చూసి అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బావిలోకి బోనును దింపి రెండింటిని రక్షించారు. పిల్లికి చిరుతపులి ఎలాంటి హాని తలపెట్టలేదని అధికారులు చెప్పారు. పిల్లిని తరుముతూ చిరుత వెళ్లినప్పుడు రెండు కలిసి బావిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. పశువైద్యులు రెండింటిని పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. చిరుతను అడవిలో వదిలేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు