Bride Attends Exam After Marriage : ఉదయం ప్రేమ పెళ్లి.. మధ్యాహ్నం డిగ్రీ ఎగ్జామ్.. బైక్‌పై కాలేజ్‌కు వెళ్లిన వధూవరులు - bride got married and wrote degree exam
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 9:10 AM IST
Karnataka Bride Attends Exam After Marriage : ప్రేమ పరీక్షలో పాసై, పెళ్లి చేసుకున్న ఓ యువతి.. అదే రోజున డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కూడా రాసింది. వరుడి బైక్‌పైనే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లి.. పెళ్లి దుస్తుల్లోనే బీఏ ఎకనామిక్స్ పరీక్ష రాసి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం జరిగింది.
రెండేళ్ల ప్రేమ..
శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్కు చెందిన సత్యవతి.. కమలా నెహ్రూ కళాశాలలో బీఏ చదువుతోంది. చెన్నైకు చెందిన ఫ్రాన్సిస్‌తో రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయమైంది. తర్వాత వారి పరిచయం.. ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పిన సత్యవతి, ఫ్రాన్సిస్.. అందరినీ పెళ్లికి ఒప్పించారు. ఆదివారం వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే.. అదే రోజున సత్యవతికి బీఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ పరీక్ష కూడా ఉంది.
ఆదివారం ఉదయం శివమొగ్గలోని బ్రహ్మప్పనగర్లో సత్యవతి, ఫ్రాన్సిస్ పెళ్లి జరిగింది. మధ్యాహ్నం ఫ్రాన్సిస్.. తన భార్యను బైక్‌పై ఎక్కించుకుని ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. వివాహ దుస్తుల్లోనే పరీక్ష రాసేందుకు వచ్చిన సత్యవతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.