Farmer Crying Due to Dying Crops in AP: నీరందక ఎండిన పంట.. కన్నీరుమున్నీరైన రైతు..

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 11:27 AM IST

Updated : Oct 19, 2023, 11:41 AM IST

Farmer Crying Due to Dying Crops in AP : కంటిపాపలా చూసుకున్న పంట నీరు లేక ఎండిపోతుంటే ఓ రైతు ప్రాణం విలవిలలాడిపోయింది. ప్రభుత్వ ప్రతినిధులెవరూ ఆ వైపు రాకపోగా.. పైనుంచి సాగునీటి కొరతే లేదంటుంటే మౌనంగా కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ అటువైపు వెళ్లగా ఆ రైతు దుఃఖం కట్టలు తెంచుకుంది. బీడు వారిన పొలాన్ని చూపుతూ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా బోరుమన్నాడు. ఈ ఘటనను చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. 

Farmers Struggling For Irrigation Water in Krishna District : ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి మండలి బుద్ధప్రసాద్ ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు గోవిందరాజును ఓదార్చిన బుద్దప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దివిసీమలో సాగునీటి సంక్షోభం ఏర్పడిందని మండిపడ్డారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కనీసం పెదవి విప్పకపోవడం శోచనీయమన్నారు. అధికారులెవ్వరూ పంట పొలాలు, కాల్వలను పరిశీలించడం లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగి నీటి సరఫరా చేసే వాళ్లని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోతే ప్రభుత్వం పట్టిసీమ నుంచి ఇచ్చేదని, దీవిసీమలో సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే.. రెండు రోజుల్లో సొర్లగొంది ఆయకట్టు నుంచి ఆందోళనకు దిగుతామని మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు.

Last Updated : Oct 19, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.