అప్పుతీర్చలేదని తాడుతో కట్టి మూడు కిలోమీటర్లు లాక్కెళ్లి - అప్పు తీర్చలేదని యువకుడిని తాడుతో లాక్కెళ్లిన ఘటన
🎬 Watch Now: Feature Video
అప్పు చెల్లించనందుకు ఒడిశాలోని కటక్‌లో ఆరుగురు వ్యక్తులు ఓ యువకుడిని తాళ్లతో ద్విచక్రవాహనానికి కట్టి మూడు కిలోమీటర్లు పరిగెత్తించారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు చూసినా పట్టించుకోలేదు. సదరు యువకుడు కొన్ని రోజుల కిందట కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని.. అప్పు ఇచ్చిన వ్యక్తితో కలిసి మరో ఐదుగురు ఆదివారం రాత్రి ఇలా హింసించారు. కటక్ షెల్టర్ చౌక్ నుంచి మిషన్ రోడ్ మీదుగా బక్షి బజార్ వరకు ప్రజలు చూస్తుండగానే అతని చేతులకు తాళ్లు కట్టి లాక్కెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను గుర్తించామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ ప్రతీక్ సింగ్ వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST