Samsung Galaxy S23 Ultra Price Drop: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరే వార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన 'గెలాక్సీ S23 అల్ట్రా' మోడల్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు సగం ధరకే కొనుగోలు చేయొచ్చు. కంపెనీ ఈ మోడల్‌పై గరిష్టంగా రూ. 69,000 భారీ డిస్కౌంట్‌ను ఇస్తోంది. దీంతో సరసమైన ధరలో అదిరే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి తరుణం.
శాంసంగ్ 'గెలాక్సీ S25' సిరీస్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 22న జరిగే ఈవెంట్‌లో ఈ రేంజ్‌ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీటి రిలీజ్‌కు ముందుగా కంపెనీ 'గెలాక్సీ S23 అల్ట్రా' మోడల్ ధరలను భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
ఏకంగా 47 శాతం డిస్కౌంట్!: శాంసంగ్ 'గెలాక్సీ S23 అల్ట్రా' 12GB + 256GB వేరియంట్ ధర రూ. 1.49 లక్షలు. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఇది రూ.79,999కే అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ ఫోన్‌పై దాదాపు 47 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో పాటు నో కాస్ట్ EMI, అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలు చేసే వ్యక్తులు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫీచర్లు: ఈ శాంసంగ్ 'గెలాక్సీ S23 అల్ట్రా' స్మార్ట్‌ఫోన్‌లో కిర్రాక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో పవర్ఫుల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది మెరుగైన పనితీరు, ఈజీ మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB+256GB, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
కెమెరా సెటప్: దీని కెమెరా విషయానికి వస్తే.. ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 200MP మెయిన్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్, 10MP పెరిస్కోప్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ సమయంలో దీని కెమెరా సామర్థ్యాలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ఇప్పటికీ ఇతర కంపెనీల నుంచి అనేక ఫ్లాగ్‌షిప్ మోడల్‌లతో పోటీపడుతోంది. దీంతో ఎవరైనా సరసమైన ధరలో గొప్ప ఫీచర్లతో కూడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం.
అదిరే ఫీచర్లు, ఆకట్టుకునే రంగులతో.. ఏథర్ 450 నయా వెర్షన్- ధర ఎంతంటే?
తరగని అందం, అద్భుతమైన ఫీచర్లతో.. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్- లాంఛ్ ఎప్పుడంటే?
యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్- ఐఫోన్ 16 సిరీస్‌పై ఆఫర్ల వర్షం!- ఎక్కడంటే?