ETV Bharat / state

VIRAL VIDEO : యూటర్న్​ తీసుకునేటప్పుడు జాగ్రత్త - లేదంటే మీకూ ఇలాగే జరగొచ్చు! - TWO INJURED IN ROAD ACCIDENT

జమ్మికుంట శివారులో రోడ్డు ప్రమాదం - ఇద్దరికి తీవ్రగాయాలు - అందులో ఒకరి పరిస్థితి విషమం - ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్

Two Injured in Road Accident at Jammikunta
Two Injured in Road Accident at Jammikunta (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 4:13 PM IST

Two Injured in Road Accident at Jammikunta : కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు డివైడర్ వద్ద యూటర్న్ తీసుకొని ముందుకు వస్తుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది.

Road Accident Video Viral : ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అవి బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. క్షతగాత్రులను జమ్మికుంట మండలం పెద్దంపేటకు చెందిన దొడ్డే రాజయ్య, జమ్మికుంట దుర్గ కాలనీకి చెందిన సంపత్​లుగా గుర్తించారు. చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంపత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్​కు తరలించాలని వైద్యులు సూచించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

లైవ్​లో రోడ్డు ప్రమాదం - సోషల్ మీడియాలో వీడియో వైరల్! (ETV Bharat)

VIRAL VIDEO : ఏ బ్రాండ్ తాగావ్ సామీ - ఏకంగా అక్కడ పడుకున్నావ్

VIRAL VIDEO : కానిస్టేబుళ్లను ఢీకొట్టి పారిపోయే యత్నం - ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.