LIVE : సికింద్రాబాద్ టు గోవా స్పెషల్ ట్రైన్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - Kishan Reddy To Launch Spl Train - KISHAN REDDY TO LAUNCH SPL TRAIN
🎬 Watch Now: Feature Video
Published : Oct 6, 2024, 11:12 AM IST
|Updated : Oct 6, 2024, 12:09 PM IST
Kishan Reddy Launched Direct Train To Goa Live : సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్ - గోవా రైలు పట్టాలెక్కనుంది. ఈ స్పెషల్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్‌కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైలును జెండా ఊపి ప్రారంభించి, అనంతరం ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Oct 6, 2024, 12:09 PM IST