శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' సంచలనం - మొదటి వారంలో రికార్డ్ వసూళ్లు - Stree 2 Collections - STREE 2 COLLECTIONS
Shraddha Kapoor Stree 2 Worldwide Box Office Collections : బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు శ్రద్ధా కపూర్ నటించిన 'స్ట్రీ 2' రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ మొదటి వారంలో ఎన్ని వందల కోట్లు సాధించిందో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. పూర్తి వివరాలు స్టోరీలో.


Published : Aug 22, 2024, 3:13 PM IST
Shraddha Kapoor Stree 2 Worldwide Box Office Collections : ఈ మధ్య బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రిలీజైన లెటెస్ట్ మూవీ 'స్త్రీ 2'. 'సాహో' బ్యూటీ, స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అమర్ కౌశిక్ ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ ముందు రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే.
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం స్టార్ హీరోల సినిమా వసూళ్లతో సమానంగా అందుకుంటోంది. అయితే తాజాగా ఈ మూవీ మొదటి వారం వసూళ్లను మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డు సెట్ చేసింది. ఇండియన్ గ్లోబల్ బాక్సాఫీస్ ముందు రూ.342 కోట్లు గ్రాస్, ఓవర్సీస్ గ్లోబల్ బాక్సాఫీస్ ముందు రూ.59 కోట్లు గ్రాస్, అంటే మొత్తంగా రూ.401 కోట్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక మొదటి ఆరు రోజుల్లో ఇండియాలో రూ. 269.2 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించగా, ఏడో రోజు రూ.20.4 కోట్లు సాధించినట్లు తెలిపారు. మొత్తంగా భారత్‌లో టోటల్ నెట్ కలెక్షన్స్ రూ.289.6 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఏ హీరోయిన్‌కు కూడా లేని ఈ సూపర్ రికార్డు ఇప్పుడు శ్రద్ధ కపూర్‌కు సొంతమైంది! అలానే మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Shraddha Kapoor Stree 2 Cast and Crew : కాగా, 2018లో విడుదలైన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2ను రూపొందించారు. జియో స్టూడియోస్, మ్యాడోక్ ఫిల్మ్ సంస్థ కలిసి సినిమాను నిర్మించారు. మూవీలో స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, అపర్ శక్తి కూడా కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సినిమాలోని సీరియస్ సన్నివేశాలను కూడా కామెడీ ట్రాక్‌లో చూపించడం ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
చిరు గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు- ఆ వెహికిల్‌కు స్పెషల్ రిజిస్ట్రేషన్! - Chiranjeevi Car Collection