ETV Bharat / entertainment

'మెగా 157'లో బీటౌన్ హీరోయిన్​​ - 24 ఏళ్ల తర్వాత సౌత్​లోకి ఎంట్రీ! - CHIRU ODELA MOVIE HEROINE

చిరు ఓదెల మూవీలో సీనియర్ హీరోయిన్​ - 24 ఏళ్ల తర్వాత సౌత్​లోకి ఎంట్రీ!

CHIRU ODELA MOVIE HEROINE
CHIRU ODELA MOVIE (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 8:45 AM IST

Mega 157 Heroine : మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'బింబిసార' ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత 'దసరా' ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పని చేయనున్నారు. నాని సమర్పిస్తున్న మూవీ అవ్వడం ప్లస్ మూవీ అనౌన్స్​మెంట్ పోస్టర్​ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?

'మెగా 157' కోసం ఓ పాపులర్‌ సీనియర్‌ హీరోయిన్‌ని సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఎవరో తెలుసా? కొన్ని నివేదికల మేరకు, ఆ బాలీవుడ్‌ నటి చివరిసారిగా 2000వ ఏడాది కమల్‌ హాసన్‌ 'హే రామ్​'లో యాక్ట్‌ చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె దక్షిణాదిలో నటిస్తున్న రెండో సినిమా 'మెగా 157' అవుతుంది. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీకాంత్ ఓదెల ఆమెని కావాలనుకుంటున్నట్లు తెలిసింది.

శ్రీకాంత్ ఓదెల చిరుతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. దీని కోసం 1990ల నేపథ్యంలో భారీ సెట్‌ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ రోల్‌ స్టైలిష్‌గా, ఆయన వయస్సుకు సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

"చిరంజీవితో కలిసి పనిచేయడం చాలా అరుదైన క్షణం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనకు దర్శకత్వం వహిస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. చిరంజీవి సినిమా స్క్రిప్ట్‌ని విన్న 48 గంటల్లోనే ఫైనల్ చేశారు." అని చెప్పారు. ఇంతకీ 'చిరు 157'లో నటించబోతున్న బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ ఎవరని ఆలోచిస్తున్నారా? ఆమే అలనాటి అందాల తార రాణీ ముఖర్జీ.

శరవేగంగా విశ్వంభర
చిత్రీకరణ దశలో ఉన్న ఫాంటసీ యాక్షన్ మూవీ 'విశ్వంభర'లో త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. వీటితో పాటు చిరు లైనప్​లో అనిల్​ రావిపుడి సినిమా ఉంది. ఇప్పటికే అనిల్ ఈ సినిమా గురించి చర్చలు జరపగా, వాటికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మెగాస్టార్​తో సాయిదుర్గా తేజ్​ స్క్రీన్ షేరింగ్- విశ్వంభరలో గెస్ట్​ రోల్!

600 మందితో షూటింగ్ - భారీ సీక్వెన్స్​లో చిరు - 'విశ్వంభర'లో అదే హైలైట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.