తెలంగాణ

telangana

ETV Bharat / technology

సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా- క్రాష్​ టెస్ట్​లో మహింద్రా మరో 2 కార్లకు 5-స్టార్ రేటింగ్ - MAHINDRA NCAP RATING

భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహింద్రా కార్లకు ఫైవ్​ స్టార్స్- ప్రయాణికుల సేఫ్టీలో బెస్ట్!!!

Bharat NCAP Rating
Bharat NCAP Rating (Photo Credit- Bharat NCAP/ Mahindra & Mahindra)

By ETV Bharat Tech Team

Published : Jan 16, 2025, 5:02 PM IST

Bharat NCAP Rating: సేఫ్టీ విషయంలో స్వదేశీ SUV తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా పెట్టింది పేరు. ఇటీవలే ఈ కంపెనీకి చెందిన మూడు వాహనాలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించగా తాజాగా మరో రెండు ఈవీ కార్లు ఇదే జాబితాలో చేరాయి. దీంతో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో మహింద్రా కార్లు బెస్ట్ అని కంపెనీ మరోసారి నిరూపించుకుంది.

భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్​ 'మహింద్రా XEV 9e', 'BE 6' ఎలక్ట్రిక్ SUVలకు 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఇచ్చింది. ఈ రెండు మహింద్రా బ్రాండ్​ ఈవీ కార్లు అడల్ట్​ అండ్ చైల్డ్ భద్రతా పరంగా ఫైవ్​ స్టార్ రేటింగ్​ను సాధించాయి. BNCAP ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల టాప్-స్పెక్ వేరియంట్​లను పరీక్షించి రేటింగ్ అందించింది. ఈ సేఫ్టీ రేటింగ్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న వీటి అన్ని వేరియంట్​లకు వర్తిస్తుంది.

మహింద్రా XEV 9e:ఈ క్రాష్​ టెస్ట్​లో XEV 9e అడల్ట్ భద్రతలో 32 పాయింట్లకు గానూ 32 పాయింట్లు సాధించింది. అయితే చైల్డ్ సేఫ్టీ పరంగా ఇది 49 పాయింట్లకు 45 పాయింట్లనే సాధించగలిగింది. డిఫార్మబుల్ బారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ AOP టెస్ట్​లో 16 పాయింట్లకు పూర్తిగా 16 పాయింట్లను సాధించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో BNCAP ఈ కారుకు 'OK' రేటింగ్​ను ఇచ్చింది.

మహింద్రా BE 6:XEV 9e మాదిరిగానే మహింద్రా BE 6 కూడా ఫైవ్​ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్‌తో ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్తమ BNCAP రేటింగ్‌లు కలిగిన కార్లలో ఒకటిగా మారింది. ఈ ఎలక్ట్రిక్ SUV అడల్ట్ ప్రయాణీకుల ప్రమాద భద్రతా రేటింగ్‌లో 32 పాయింట్లకు 31.97 పాయింట్లను సాధించింది. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్ట్‌లో 49కి 45 స్కోర్‌ను పొందింది.

మహింద్రా XEV 9e, BE 6 భద్రతా ఫీచర్లు:మహింద్రా XEV 9e, BE 6 రెండింటినీ బ్రాండ్ INGLO ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తీసుకొచ్చారు. దీంతో ఇవి అనేక భద్రతా ఫీచర్లతో లెవల్ 2 ADAS సూట్​తో వస్తాయి. ఈ సూట్ లేన్ ఛేంజ్, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.

దీనితో పాటు ఈ రెండు EVలు 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), TPMS, బ్లైండ్ వ్యూ మానిటర్, సేఫ్ 360 లైవ్ వ్యూ, రికార్డింగ్, ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ బ్రేక్ బూస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, కార్నరింగ్ ల్యాంప్, ఆటో బూస్టర్ ల్యాంప్​తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉన్నాయి.

కాగా కంపెనీ నుంచి ఇప్పటికే మహింద్రా థార్ రాక్స్, XUV400 EV, మహింద్రా 3XO వాహనాలు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్​ను సాధించాయి. తాజాగా ఈ లిస్ట్​లోకి 'మహింద్రా XEV 9e', 'BE 6' ఎలక్ట్రిక్ SUVలు వచ్చి చేరాయి.

ప్రంపంచంలోనే అతిపెద్ద స్మార్ట్​టీవీ లాంఛ్- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!

చరిత్ర సృష్టించిన ఇస్రో- అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం

వాట్సాప్​లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు- సెల్ఫీలను స్టిక్కర్లుగా.. ఇకపై చాట్​లో అన్​లిమిటెడ్ ఫన్!

ABOUT THE AUTHOR

...view details