Apple Stops Selling 3 iPhone Models: టెక్ దిగ్గజం యాపిల్ తన చౌకైన 'ఐఫోన్ 16e'ను లాంఛ్ చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాత మూడు ఐఫోన్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది. 'ఐఫోన్ 16e' మూడేళ్ల పాత ఫోన్‌పై అనేక అప్‌గ్రేడ్‌లను అందిస్తున్నందున కొత్త మోడల్‌కు చోటు కల్పించేందుకు యాపిల్ తన మూడవ తరం ఐఫోన్ SEని దశలవారీగా తొలగించింది. ఈ అప్గ్రేడ్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టుతో A18 చిప్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించిన తర్వాత కుపెర్టినో ఆధారిత కంపెనీ 2022లో ప్రారంభించిన స్టాండర్డ్ ఐఫోన్ 14 మోడళ్లను యాపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు కనిపిస్తోంది.
యాపిల్ నిలిపివేసిన ఐఫోన్ మోడల్స్ ఇవే!: 'ఐఫోన్ 16e' లాంఛ్ అయిన వెంటనే యాపిల్ తన పాత 'ఐఫోన్ SE', 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్' మోడల్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు కన్పిస్తుంది. అయితే ఈ మోడల్స్ ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్లు లేదా భారతదేశంలో పునరుద్ధరించిన స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్టాక్‌లు కూడా త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది.
ఇక యాపిల్ తన 'ఐఫోన్ SE' మోడల్‌ను మార్చి 2022లో ప్రారంభ ధర రూ. 43,900 కంపెనీ లాంఛ్ చేసింది. మరోవైపు 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్' సెప్టెంబర్ 2022లో వరుసగా రూ. 79,900, రూ. 89,900 ధరలతో వచ్చాయి.
ఇదిలా ఉండగా 'ఐఫోన్ 16' ఫ్యామిలీని ప్రారంభించిన తర్వాత యాపిల్ గతేడాది 'ఐఫోన్ 15 ప్రో' సిరీస్, 'ఐఫోన్ 13' మోడళ్ల సేల్స్‌ను నిలిపివేసింది. యూరోపియన్ యూనియన్ చాలా పరికరాల్లో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లను తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని అమలు చేయడంతో కంపెనీ అనేక యూరోపియన్ దేశాలలోని దాని ఆన్‌లైన్ స్టోర్‌ల నుంచి 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్', 'ఐఫోన్ SE' మోడల్స్‌ను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది.
దీంతో యాపిల్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం బేస్ 'ఐఫోన్ 15' సిరీస్, 'ఐఫోన్ 16' సిరీస్, కొత్త 'ఐఫోన్ 16e' మోడల్స్ ఉన్నాయి. ఇక 'ఐఫోన్ 17' లైనప్ ప్రకటించినప్పుడు కంపెనీ స్టాండర్డ్ 'ఐఫోన్ 15', 'ఐఫోన్ 15 ప్లస్'లను వదులుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ 16e ధర, స్పెసిఫికేషన్లు:
- డిస్ప్లే: ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది.
- ప్రాసెసర్: కంపెనీ ప్రాసెసర్ కోసం ఇందులో ఇది హుడ్ 3nm A18 చిప్‌ను అందించింది.
- కెమెరా సెటప్: ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా ఉంది.
- ప్రొటెక్షన్: ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
- కనెక్టివిటీ ఫీచర్లు: ఈ హ్యాండ్‌సెట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఈ కొత్త 'ఐఫోన్ 16e' iOS 18లో నడుస్తుంది. వీటన్నింటితో పాటు ఈ ఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 16e ధర: ఈ కొత్త మోడల్ ఐఫోన్ మార్కెట్లో మూడు వేరియంట్లులో అందుబాటులో ఉంది.
- ఐఫోన్ 16e బేస్ మోడల్ ధర: రూ.59,900 (128GB ఇంటర్నల్ స్టోరేజ్)
- ఐఫోన్ 16e సెకండ్ వేరియంట్ ధర: రూ.69,900 (256GB)
- ఐఫోన్ 16e మూడో వేరియంట్ ధర: రూ.89,900(512GB)
ఈ మోడల్ ప్రీ-ఆర్డర్స్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి దీని సేల్‌కి అందుబాటులోకి వస్తుంది.
భూమి వైపు దూసుకొస్తున్న 'సిటీ కిల్లర్'- ఇది ఢీకొట్టిందంటే అంతా బూడిదే!
పవర్ఫుల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15తో శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్!- కేవలం రూ.10,499లకే!
స్మార్ట్ టీవీ కోసం 'జియోటెలి ఓఎస్'- ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే!