Samsung Galaxy A06 5G: శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. కిర్రాక్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే మార్కెట్లో 'శాంసంగ్ A06 5G' స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. దీని ధర రూ. 10,499 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ దీన్ని ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో పాటు దీన్ని అదిరే లుక్‌లో డిజైన్ చేసింది. గతేడాది ఇదే ఫోన్‌ను 4G వేరియంట్‌లో తీసుకుని రాగా, ఇప్పుడు దీన్ని 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో లాంఛ్ చేసింది. అంతేకాక దీనికి మరో నాలుగు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ చెబుతోంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
'శాంసంగ్ గెలాక్సీ A06 5G' స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:
డిస్ప్లే: ఈ ఫోన్ 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది.

ప్రాసెసర్: కంపెనీ ప్రాసెసర్ కోసం దీనిలో డైమెన్‌సిటీ 6300 చిప్‌సెట్‌ను అమర్చింది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక వైపు 50MP కెమెరాతో పాటు 2MP కెమెరా డెప్త్ సెన్సర్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ: ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఔటాఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15తో కూడిన వన్‌యూఐ 7తో వస్తోంది. దీనికి నాలుగేళ్లపాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

ప్రొటెక్షన్: ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌తో వస్తోంది.

దీంతోపాటు 12 5G బ్యాండ్లకు తమ ఫోన్ సపోర్ట్ చేస్తుందని శాంసంగ్ చెబుతోంది.

కలర్ ఆప్షన్స్: మార్కెట్లో ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
- బ్లాక్
- గ్రే
- లైట్ గ్రీన్
వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 4GB RAM + 64GB స్టోరేజ్
- 4GB RAM + 128GB స్టోరేజ్
- 6GB RAM + 128GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా ధరలు:
- 4GB RAM + 64GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ.10,499
- 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ.11,499
- 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ.12,999
సేల్స్ డీటెయిల్స్: ఈ ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు అన్ని రిటైల్ ఔట్‌లెట్లలో లభిస్తుంది. అయితే దీనితో పాటు బాక్స్‌లో కేవలం టైప్-C కేబుల్ మాత్రమే లభిస్తుంది. దీంతో ఛార్జింగ్ అడాప్టర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక రూ.129 చెల్లించి శాంసంగ్ కేర్+ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ఫోన్‌కు ఏడాది పాటు స్క్రీన్ రీప్లేస్ వారెంటీ లభిస్తుంది.
స్మార్ట్ టీవీ కోసం 'జియోటెలి ఓఎస్'- ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే!
గ్లోబల్ మార్కెట్లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్- ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్'- ఇకపై AI టెక్నాలజీ మరింత యూజ్‌ఫుల్!