ETV Bharat / technology

మీ ఫోన్‌లోని డేటా మొత్తం పోయిందా? డోంట్ వర్రీ- ఈజీగా రికవరీ చేసుకోండిలా! - ANDROID DATA RECOVERY 2025

మీ ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ అయిపోయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో ఫోటోస్‌, వీడియోస్‌, ఫైల్స్ మొత్తం రికవరీ చేయండిలా!

Android Data Recovery 2025
Android Data Recovery 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2025, 7:54 PM IST

Android Data Recovery 2025 : మీ సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ అయిపోయిందా? వాటిలో చాలా ముఖ్యమైన ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయా? డోంట్ వర్రీ. కొన్ని ఈజీ టిప్స్‌, మెథడ్స్‌తో డిలీట్‌ అయిన డేటా మొత్తాన్ని రికవరీ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన డేటాను గూగుల్ బ్యాకప్‌, గూగుల్ ఫోటోస్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో సులువుగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు స్టెప్‌-బై-స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

గూగుల్ బ్యాకప్ ద్వారా డేటా రికవరీ
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు గూగుల్ బ్యాకప్‌ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌, యాప్‌ డేటా, డివైజ్ సెట్టింగ్స్‌ సహా మీడియా అంతా మీ గూగుల్ అకౌంట్‌లో సేవ్ అయిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మీ ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ అయిపోతే, ఈ గూగుల్ అకౌంట్‌లో సేవ్ అయిన మీ డేటా మొత్తాన్ని చాలా సులువుగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగంటే?

  • ముందుగా మీ ఫోన్‌లోని Settings యాప్‌ను ఓపెన్ చేయాలి.
  • తరువాత Googleపై క్లిక్ చేయాలి. ఆ తరువాత Backupపై ట్యాప్‌ చేయాలి.
  • తరువాత Backup by google oneను టర్న్‌ ఆన్‌ చేయాలి.
  • తరువాత ఫొటోస్‌, వీడియోస్‌, డివైస్ డేటా- వీటిలో మీరు బ్యాకప్ చేయాలని అనుకుంటున్న వాటిని ఎంచుకోవాలి.
  • తరువాత Back up now పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్‌. మీకు కావాల్సిన డేటా మొత్తం రికవరీ అవుతుంది.
  • అయితే ఈ బ్యాకప్ మొత్తం పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. దాని కోసం మీరు కాస్త వేచిచూడాల్సి ఉంటుంది.

నోట్‌ : మీరు గూగుల్ బ్యాకప్‌ను ముందుగా ఎనేబుల్ చేసుకుని ఉంటేనే ఇది పనిచేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గూగుల్ బ్యాకప్ ద్వారా ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లు, స్పెసిఫిక్ యాప్ డేటాను రికవరీ చేయలేరు.

ఆండ్రాయిడ్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్స్‌ ద్వారా
కొన్ని సార్లు మనం పొరపాటున ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ చేసేస్తూ ఉంటాం. మరికొన్నిసార్లు సిస్టమ్ ఎర్రర్స్‌ వల్ల, సెల్‌ఫోన్ భౌతికంగా పాడుకావడం వల్ల కూడా డేటా మొత్తం కోల్పోతూ ఉంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ ప్రస్తుతం మార్కెట్లో చాలా డేటా రికవరీ సాఫ్ట్‌వేర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ ఫోటోస్‌, వీడియోస్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌, ఫైల్స్‌ను చాలా సులువుగా రికవరీ చేయగలగుతాయి.

Tenorshare UltDate For android అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్‌. దీనిని విండోస్‌, మ్యాక్‌ సిస్టమ్స్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని బ్రాండ్‌ల ఆండ్రాయిడ్ ఫోన్లకూ సపోర్ట్ చేస్తుంది. దీనిలో ముందుగా ప్రివ్యూ చూసుకుని, అవసరైన డేటాను రికవరీ చేసుకునే వీలుంది. ఇలాంటివి మార్కెట్లో చాలానే సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. వాటిని కూడా మీరు ట్రై చేయవచ్చు.

గూగుల్ ఫోటోస్‌ ద్వారా
మనం డిలీట్‌ చేసిన ఫోటోలు ట్రాష్‌లోకి వెళ్తాయి. సాధారణంగా బ్యాకప్ చేయని ఫోటోలు, వీడియోలు ట్రాష్‌లో 30 రోజుల వరకు ఉంటాయి. బ్యాకప్ చేసిన ఫోటోలు, వీడియోలు 60 రోజుల వరకు ట్రాష్‌లో ఉంటాయి. కనుక ఆ కాలపరిమితి లోపు మనం చాలా సులువుగా డిలీట్ చేసిన ఫోటోలను వెనక్కు తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీకు అవసరమైన ఫోటో లేదా వీడియో ఆర్కైవ్స్‌లో ఉందో, లేదో చూడాలి.
  • ఒకవేళ ఆ ఫోటో/వీడియో ఉంటే దానిని అన్‌ఆర్క్వైవ్ చేయాలి. అప్పుడు అది గూగుల్ ఫొటోస్‌లో కనిపిస్తుంది.
  • ఒకవేళ అక్కడ కనిపించకపోతే ట్రాష్‌లో చూడాలి. ఒకవేళ అక్కడ ఉంటే, దానిని సులువుగా రీస్టోర్‌ చేయవచ్చు.
  • మీ ఫోటో క్వాలిటీ మిస్‌కాకుండా ఉండాలంటే, ముందుగానే మీ గూగుల్ ఫొటోస్‌లో Backup & Syncను ఎనేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీ ఫొటోస్‌ క్లౌడ్‌లో సేవ్ అవుతాయి. కనుక మీరు చాలా సులువుగా వాటిని వెనక్కు తీసుకోవచ్చు.

గూగుల్ డ్రైవ్‌ ద్వారా ఫైల్స్ రీస్టోర్‌ చేయండిలా!
మన ఫోన్‌లోని చాలా విలువైన ఫైల్స్ (పీడీఎఫ్‌, డాక్యుమెంట్స్‌, స్ప్రెడ్‌ షీట్స్‌) డిలీట్ అయిపోతే, వాటిని గూగుల్ డ్రైవ్ ద్వారా సులువుగా రికవరీ చేయవచ్చు. అది ఎలా గంటే?

  • ముందుగా మీరు Drive.google.com ఓపెన్ చేయాలి.
  • లెఫ్ట్‌ సైడ్‌బార్‌లోని Trash పై క్లిక్ చేయాలి. Trashed Dataలో మీ ఫైల్స్ ఉన్నాయో, లేదో చెక్ చేయాలి.
  • ఒక వేళ ఉంటే, ఆ ఫైల్‌పై రైట్‌-క్లిక్ చేసి Restoreపై క్లిక్ చేయాలి. అంతే సింపుల్‌గా మీ ఫైల్‌ ఒరిజినల్ లొకేషన్‌లోకి వచ్చేస్తుంది.

మీ ఫోన్‌లోని డేటా డిలీట్ కాకుండా కాపాడుకోండిలా!

  • మన ఫోన్‌లోని డేటాను సురక్షితంగా ఉంచుకోవాలంటే, రెగ్యులర్ బ్యాకప్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • మీ ఫోన్‌కు సరిపోయే మంచి బ్రాండెడ్ ఎస్‌డీ కార్డ్‌ను ఎంచుకోవాలి. దానిని రెగ్యులర్‌గా ఫార్మాట్ చేస్తుండాలి. దీనివల్ల డేటా కరప్ట్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది.
  • వీలైనంత వరకు థర్డ్ పార్టీ యాప్‌లను వాడకండి. కేవలం గూగుల్ ప్లేస్టోర్ నుంచి మాత్రమే సరైన యాప్‌లను ఎంచుకోండి.
  • మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. దీని వల్ల మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.

మీ పిల్లలు ఫోన్ చూస్తూ సరిగ్గా చదవట్లేదా? ఇలా చేస్తే ఏకాగ్రత, ఇంట్రెస్ట్ పెరగుతుందని సలహా!

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోతున్నారా? బ్యాటరీ వేడెక్కుతే ఇక అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.