Laptop Under 15000 :ఈ కాలంలో ల్యాప్‌టాప్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ మంచి ల్యాప్‌టాప్ కావాలంటే రూ.50వేలైనా ఉండాలి. ఫీచర్లు పెరిగే కొద్దీ రేట్లూ పెరుగుతాయి. కానీ, భారత్‌లో ఒక కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్ అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఆ ధర, ఫీచర్లు చూస్తుంటే వెంటనే కొనేయాలనిపిస్తుంది. ఇంతకీ అది ఏ కంపెనీ ల్యాప్‌టాప్? ఫీచర్ల సంగతేంటి అని తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి.
రిలయన్స్ కంపెనీలో భాగమైన జియో ఇండియన్ టెలికాం ప్రస్తుతం ఎలక్ట్రానిక్ రంగంలో ఓ సంచలనం. ప్రస్తుత రోజుల్లో డేటా అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉందంటే దానికి కారణం ఒక రకంగా ఈ కంపెనీయే అని చెప్పవచ్చు. డేటా దగ్గర్నుంచి ఫోన్ల వరకు ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా మరో సంచలనానికి తెర తీసింది. అతి తక్కువ ధరకే సామాన్యులకూ సైతం అందుబాటులో ఉండేలా అద్భుతమైన ఫీచర్లతో ఓ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
జియో ల్యాప్‌టాప్ ఫీచర్లివే
రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఆ ల్యాప్‌టాప్ పేరు 'Jio Book 4G'. గతేడాది జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ప్రదర్శనలో ఈ సూపర్ అఫర్డబుల్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేశారు. యాంటీ-గ్లేర్ హెచ్డీ స్క్రీన్ కలిగిన 11.6 అంగుళాలతో మంచి కాంపాక్ట్ సైజులో వస్తుందీ ల్యాప్‌టాప్. ఇది 100జీబీ క్లౌడ్ స్టోరేజీతో వస్తుంది. అంతేకాకుండా చూడటానికి చాలా స్లిమ్‌గానూ ఉంది. మీడియాటెక్ ఆక్టా-కోర్ చిప్సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.