Audi Q5 Sportback: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త 'Q5 స్పోర్ట్‌బ్యాక్' SUVని ఆవిష్కరించింది. ఇది దాని స్టాండర్డ్ 'ఆడీ Q5'కి కూపే-ఎస్‌యూవీ వెర్షన్. కంపెనీ ఈ కారును ప్రత్యేకమైన డిజైన్‌తో అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఎక్స్టీరియర్: ఈ కొత్త Q5 స్పోర్ట్‌బ్యాక్ ముందు భాగం చాలా వరకు స్టాండర్డ్ SUVని పోలి ఉంటుంది. అయితే ఇందులో చాలా మార్పులు చేశారు. స్లోపింగ్ రూఫ్‌తో దీని వెనక భాగం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో స్పాయిలర్ ఉంది. ఇది దాని కూపే-SUV లుక్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ కారు వెనకవైపు OLED టెక్నాలజీతో టెయిల్-ల్యాంప్స్‌తో పాటు స్టాండర్డ్ SUV మాదిరిగానే కాంట్రాస్టింగ్ సిల్వర్ ట్రిమ్‌తో డ్యూయల్-టోన్ బంపర్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్: ఈ కూపే-SUV దాని ప్రీవియస్ మోడల్‌తో పోలిస్తే మరింత మోడ్రన్ క్యాబిన్‌ను కలిగి ఉంది. దాని క్యాబిన్‌లో స్పోర్ట్, S లైన్, క్వాట్రో వంటి థ్రీ ఎక్విప్మెంట్ లెవెల్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలోని హైయర్ వేరియంట్స్ ఆడి కొత్త 'డిజిటల్ స్టేజ్' స్క్రీన్‌తో వస్తున్నాయి. ఇది 11.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో కలిపి ఒక లార్జ్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్టాండర్డ్ 'ఆడి Q5' మాదిరిగానే ఫ్రంట్ ప్యాసింజర్ల కోసం 10.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
పవర్‌ట్రెయిన్: ఈ లైనప్‌లోని ఎంట్రీ-లెవల్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 204hp పవర్, 340Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా AWD సెటప్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇందులో స్టాండర్డ్‌గా 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ క్వాట్రోని కలిగి ఉంది. ఇది 204hp శక్తిని, 400Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు ఇంజిన్లు 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇవి 1.7kWh బ్యాటరీ ద్వారా 24hp పవర్‌ను అందిస్తాయి. ఈ కొత్త ఆడి 'Q5 స్పోర్ట్‌బ్యాక్' కూపే-SUV పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టాప్ వేరియంట్ ఇప్పుడు డీజిల్‌కు బదులుగా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది మైల్డ్-హైబ్రిడ్ 3.0-లీటర్, V6 TFSI పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 362hp పవర్, 550Nm టార్క్‌ను అందిస్తుంది. క్వాట్రో AWD స్టాండర్డ్‌గా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.
కంపెనీ ప్రస్తుతం ఇండియాలో తన ప్రీవియస్ జనరేషన్ 'ఆడి క్యూ5' కార్లను విక్రయిస్తోంది. దీని నెక్స్ట్ జనరేషన్ 'ఆడి Q5' భారత మార్కెట్లో ఇంకా రిలీజ్ కాలేదు. ఇక కొత్త 'ఆడి క్యూ5 స్పోర్ట్‌బ్యాక్' విషయానికి వస్తే కంపెనీ తన స్మాలర్ మోడల్ 'ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్'ను విక్రయిస్తోంది. అయితే ఈ క్రమంలో 'మెర్సిడెస్ బెంజ్ GLC' కూపే వంటి కార్లకు పోటీగా ఈ కొత్త 'ఆడి Q5 స్పోర్ట్‌బ్యాక్'ను ఇండియాలో లాంఛ్ చేస్తుందో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.
టాప్ క్లాస్ ఫీచర్లతో రెడ్మీ కొత్త మొబైల్స్- రేటు చూస్తే ఒక్క క్షణం కూడా ఆగలేరు..!
మహింద్రా 'BE 6e' vs టాటా 'కర్వ్' ఈవీ- దేని రేంజ్ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్ మనీ?