ETV Bharat / lifestyle

ఏ బ్రాండ్ పిండి లేకుండానే 'గులాబ్ జామూన్'- ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయ్​! - EASY BREAD GULAB JAMUN RECIPE

-ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్​తో గులాబ్ జామూన్ -పిండి లేకుండానే టేస్టీగా చేసుకోవచ్చు!

EASY BREAD GULAB JAMUN RECIPE
EASY BREAD GULAB JAMUN RECIPE (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 11, 2025, 3:52 PM IST

Easy Bread Gulab Jamun Recipe: గులాబ్ జామూన్ అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. చాలా మంది ఈ స్వీట్​ను ఎంతో ఇష్టపడతారు. కానీ, దీనిని చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని, ఎక్కువ ప్రయాస అని అనుకుంటారు. కానీ, ఇలా చేస్తే ఎలాంటి పిండి అవసరం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో మిగిలిపోతున్న బ్రెడ్​ను వాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా వెరైటీగా బ్రెడ్​తో గులాబ్ జామూన్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • నాలుగు వైట్ బ్రెడ్ స్లైసులు
  • పావు కప్పు పాలు
  • ఒక కప్పు పంచదార
  • అర టీ స్పూన్ యాలకుల పొడి
  • కొన్ని రేకులు కుంకుమ పువ్వు
  • కొన్ని చుక్కలు రోజ్ ఎసెన్స్
  • ఒకటిన్నర కప్పుల నీళ్లు
  • వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం

  • ముందుగా బ్రెడ్ స్లైసులను తీసుకుని అంచులను కట్ చేసుకుని మధ్యలో భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో కాచి చల్లార్చిన పాలను పోసి చేతితో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మాష్ చేసుకుంటూ పిండిముద్దలాగా చేసుకోవాలి. (మరీ గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలను కలుపుకోవచ్చు)
  • అనంతరం చిన్న పిండిముద్దని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు, పంచదార వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి.
  • పంచదార కరిగిన తర్వాత అందులోనే కుంకుమపువ్వు రేకులు, యాలకులు, రోజ్ ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి.
  • 3 నిమిషాలపాటు మరిగించిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మరో కడాయిలో నూనె పోసి వేడి చేసుకుని అందులో ముందుగా రెడీ చేసిన బ్రెడ్డు ఉండల్ని వేసుకోవాలి.
  • మంటను మీడియం ఫ్లేములో ఉంచి బ్రెడ్డు ఉండలు బంగారు రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్డు ఉండల్ని పంచదార పాకంలో వేసుకోవాలి.
  • ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ కలిపి పంచదార పాకంలోనే సుమారు 30 నిమిషాలపాటు నానపెట్టుకోవాలి.
  • అంతే, 30 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే బ్రెడ్డు గులాబ్ జామూన్ ను హాయిగా తినేయవచ్చు.

మిగిలిపోయిన కూరగాయలతో 'వెజ్ మిక్స్​డ్ పచ్చడి'- వేస్ట్ కాకుండా సూపర్ టేస్ట్! 15 నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

'ఎగ్ కారం దోశ' ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? స్పైసీ గార్లిక్ చట్నీతో టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.