Audi Q7 Facelift Launched: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో 'ఆడి క్యూ7' కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కంపెనీ ప్రస్తుత జనరేషన్లో ఇది రెండో ఫేస్‌లిఫ్ట్. ఆడి.. కొద్ది రోజుల క్రితమే దీని బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఎక్స్టీరియర్: ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ జనవరి 2024లో గ్లోబల్‌గా పరిచయం చేశారు. దీన్ని అప్డేట్ చేసి, ముఖ్యంగా కాస్మెటిక్ మార్పులు చేసి ఇప్పుడు లాంఛ్ చేశారు. Q6 e-Tron వంటి కస్టమైజబుల్ లైట్ సిగ్నేచర్‌తో కొత్త OLED హెడ్‌ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. ఈ కారు థిక్ క్రోమ్ సరౌండ్ అండ్ హెక్సాగోనల్ ప్యాటెర్న్తో కొత్త గ్రిల్, Q8 SUV మాదిరిగానే రీడిజైన్డ్ బంపర్లను కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్: ఈ అప్డేటెడ్ వెర్షన్ కారు ఐదు ఎక్స్టీరియర్ కలర్స్‌తో వస్తుంది.
- సఖిర్ గోల్డ్
- వైటోమో బ్లూ
- మైథోస్ బ్లాక్
- సమురాయ్ గ్రే
- గ్లేసియర్ వైట్
ఇంటీరియర్: ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో పరిశీలిస్తే.. ఇందులో సెడార్ బ్రౌన్, సైగా బీజ్ వంటి రెండు అప్హోల్స్టరీ షేడ్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అప్‌గ్రేడ్ చేసినప్పటికీ దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ కారు లేన్-ఛేంజ్ వార్నింగ్ సిస్టమ్‌తో అప్డేటెడ్ వర్చువల్ కాక్‌పిట్‌తో వస్తుంది. ఇది కాకుండా ఇందులో వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కూడా అందుబాటులో ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్: ఈ జనరేషన్ 'ఆడి క్యూ7' కారును డీజిల్ ఇంజిన్‌తో పరిచయం చేసినప్పటికీ, కొన్నేళ్ల తర్వాత ఇండియన్ మార్కెట్లో డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కారణంగా కంపెనీ.. 'ఆడి క్యూ7'లో 3.0-లీటర్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. ఈ ఇంజిన్ 340hp పవర్, 500 Nm టార్క్ ఇస్తుంది. దీనితో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆడి క్వాట్రో AWD టెక్నాలజీని స్టాండర్డ్‌గా వస్తుంది. 'Q7' 5.6 సెకన్లలో 0-100kph స్పీడ్ అందుకోగలదని, దీని టాప్ స్పీడ్ 250kph వరకు ఉంటుందని ఆడి పేర్కొంది.
ధర: కంపెనీ ఈ కారును రూ. 88.66 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది.
'గ్లోసీ బ్యాక్ డిజైన్'తో లావా మొబైల్.. చూడటానికి అచ్చు ఐఫోన్ లాగే.. కేవలం రూ.6,999లకే..!
మహింద్రా 'BE 6e' vs టాటా 'కర్వ్' ఈవీ- దేని రేంజ్ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్ మనీ?