Astrology Remedies for Success in Work : నిత్య జీవితంలో తాము అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ ఆశపడుతారు. కానీ, కొన్నిసార్లు మనం అనుకున్న పనులు పూర్తికావు. ఏవో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. దీంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. ఏం చేయాలో తెలియక రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంటారు. అలాంటి సందర్భాల్లో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా అనుకున్న పనులు పూర్తవుతాయని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి అవి ఏంటి? ఎలా చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పసుపు పరిహారం: మనం ఏ పని ప్రారంభించినా, అందులో విజయం సాధించడానికి, ఆటంకాలు తొలగిపోవడానికి పసుపు పరిహారం పాటిస్తే మంచిదని మాచిరాజు చెబుతున్నారు. పని మొదలు పెట్టేముందు 3 పసుపు పొట్లాలను వెంట తీసుకెళ్లాలట. అంటే కొంచెం పసుపును పేపర్లో పొట్లం లాగా చుట్టుకోవాలి. అలా మూడు పసుపు పొట్లాలు సిద్ధం చేసుకోవాలి. మొదటి పొట్లాన్ని దగ్గరలోని ఏదైనా దేవాలయంలో ఉంచాలి. రెండో పొట్లాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదలాలి. మూడో పొట్లాన్ని మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. పని పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న పసుపు పొట్లాన్ని మర్రి లేదా రావి లేదా వేప చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి రావాలి.
ఈ పరిహారాలు పాటించినా:
మిరియాలు: ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు అది పూర్తిగా సక్సెస్ కావాలంటే 14 మిరియాలను తీసుకుని గడప బయటి వైపు 7 ఉంచి, గడప లోపలి వైపు మిగిలిన 7 మిరియాలు ఉంచాలి. ఆ తర్వాత వాటిని దాటి బయటికి వెళ్లాలి. మీరు బయటికి వెళ్లిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని ఇంట్లో ఉన్నవారికి చెప్పాలి. ఇలా చేయడం వల్ల చేసే కార్యంలో విజయం లభిస్తుందని తాంత్రిక పరిహారంలో చెప్పినట్లు మాచిరాజు చెబుతున్నారు.
ఆవ నూనె: పనులు విజయవంతంగా పూర్తి కావాలంటే పని మీద బయటికి వెళ్లే సమయంలో పూజా మందిరంలో దీపం వెలిగించాలి. అందుకోసం దేవుడి గదిలో మట్టి ప్రమిద ఉంచి అందులో ఆవ నూనె పోయాలి. ఆ నూనెలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపారాధన తర్వాత బయటికి వచ్చి మీ దోసిళ్లలో రెండు లవంగాలు ఉంచి ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ వాటిని సూర్యునికి చూపించాలి. అనంతరం ఆ రెండు లవంగాలను మీరు వెలిగించిన దీపంలో వేయాలి. అలా చేస్తే ఆ దీపం వల్ల కార్యసిద్ధి లభిస్తుందని అంటున్నారు.
నిమ్మకాయల పరిహారం: దెబ్బలు, మచ్చలు లేనటువంటి మూడు పచ్చని నిమ్మకాయలను తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటి ముందు కొద్దిగా ఆవుపేడ ఉంచి దాని మీద ఈ నిమ్మకాయలు ఉంచాలి. అనంతరం ఆవు పేడ మీద పసుపు, కుంకుమ, గంధం వేసి మీరు అనుకున్న పని పూర్తవ్వాలని నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసేటప్పుడు ఓం సురభ్యై నమః అని చదువుతూ మీరు చేయాలనుకున్న పనిని మనసులో చెప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతటి కష్టమైన పని అయినా సరే ఈజీగా పూర్తవుతుందని మాచిరాజు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
జ్యోతిష్యశాస్త్రం కీలక సూచన - హెయిర్ కటింగ్, షేవింగ్ - ఈ రోజుల్లో అస్సలే చేయించవద్దట!
శక్తిమంతమైన మాఘ పౌర్ణమి - ఈశాన్యంలో ఈ దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు!