ETV Bharat / technology

'గ్లోసీ బ్యాక్ డిజైన్'తో లావా మొబైల్.. చూడటానికి అచ్చు ఐఫోన్ లాగే.. కేవలం రూ.6,999లకే..! - LAVA YUVA 4

'లావా యువ 4' స్మార్ట్​ఫోన్ లాంఛ్- దీని ఫీచర్లు చాలా అడ్వాన్స్ గురూ..!

LAVA Yuva Series
LAVA Yuva Series (LAVA Mobiles)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 28, 2024, 6:56 PM IST

Lava Yuva 4 Launched: దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త 'LAVA Yuva 4' మొబైల్​ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. Unisoc T606 ప్రాసెసర్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. AnTuTuలో ఈ ఫోన్ 230,000 కంటే ఎక్కువ స్కోర్‌ను సాధించిందని లావా చెబుతోంది. AnTuTu అనేది ఆండ్రాయిడ్ డివైజస్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్‌మార్క్ యాప్‌లలో ఒకటి. ఇది స్మార్ట్​ఫోన్స్, టాబ్లెట్స్ వంటి డివైజ్​ల పనితీరును అంచనా వేసి స్కోర్​ను కేటాయిస్తుంది.

ఇక 'లావా యువ 4' మొబైల్ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్‌ల ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత్​లో ప్రారంభించిన 'లావా్ యువ 3' మొబైల్​కు ఇది సక్సెసర్.

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్​: ఈ కొత్త 'లావా యువ 4' మొబైల్ 6.56 అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ 4GB RAM, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో Unisoc T606 SoCని కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్: ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. దీని ఫ్రంట్ కెమెరాను ముందు ప్యానెల్ పైభాగంలో హోల్-పంచ్ స్లాట్ లోపల అమర్చారు.

పవర్ ప్యాక్: 'లావా యువ 4' ఫోన్​లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ ఫీచర్‌గా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను ఇందులో ఇన్​స్టాల్ చేశారు. ఈ స్మార్ట్​ఫోన్​ 'గ్లోసీ బ్యాక్ డిజైన్'ను కలిగి ఉందని తెలుస్తోంది.

కలర్ ఆప్షన్స్:

  • గ్లోసీ బ్లాక్
  • గ్లోసీ పర్పుల్
  • గ్లోసీ వైట్

ధర: ఇండియాలో ఈ ఫోన్ బేస్ 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.7,499.

'Audi'కి హలో చెబుదామా?- గ్రాండ్​ లుక్​తో 'Q5 స్పోర్ట్‌బ్యాక్‌' కారు వచ్చేస్తోంది!

టాప్ క్లాస్ ఫీచర్లతో రెడ్​మీ కొత్త మొబైల్స్- రేటు చూస్తే ఒక్క క్షణం కూడా ఆగలేరు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.