Kitchen Cleaning Tips : ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడంలో కిచెన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. దాంతో వివిధ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది కిచెన్ క్లీనింగ్ని పెద్ద టాస్క్‌లా ఫీల్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే కొందరు వీకెండ్లో కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకుంటుంటారు. కానీ, అప్పుడు ఒకేసారి వంటగది మొత్తం శుభ్రం చేసుకోవాలంటే కాస్త అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి, అలాకాకుండా రోజువారీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు కిచెన్‌ని నీట్‌గా, శుభ్రంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. పైగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సింక్‌ని శుభ్రంగా ఉంచుకోవడం : కిచెన్‌లో సింక్‌ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే దుర్వాసనను వస్తూ ఉంటుంది. దాంతో ఇంట్లో ఉండాలంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి సింక్‌ని ఎప్పటికప్పుడు ఉప్పు నీరు, సర్ఫ్ వంటి వాటితో శుభ్రం చేయాలి. అలాగే, దుర్వాసన రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి ఉపయోగించి సింక్‌ని క్లీన్ చేసుకోవాలి.
స్టీల్ సింక్ వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తేనే జిడ్డు, దుర్వాసన పోయి కొత్తదానిలా!
ఈ ప్రదేశాలను క్లీన్ చేసుకోవడం : వంట పూర్తయ్యాక ఎప్పటికప్పుడూ స్టౌతోపాటు దానికింద, చుట్టుపక్కల ప్రదేశాలను వేడినీటిలో, నిమ్మకాయ, డిష్‌వాష్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా ఆయా ప్రదేశాల్లో పడిన నూనె మరకలు, ఆహార అవశేషాలు ఈజీగా తొలగిపోతాయి. దాంతో కిచెన్ శుభ్రంగా ఉండడమే కాకుండా కుటుంబాన్ని జబ్బులకు దూరంగా ఉంచగలుగుతారు.
ఫ్రిజ్‌ని నీట్‌గా ఉంచుకోవడం : చాలా మంది వంట పూర్తవ్వగానే మిగిలిన పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. దాంతో అది అవసరమైన, అనవసరమైన వస్తువులతో నిండి అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అలాకాకుండా ఉండాలంటే అవసరమైన వాటిని మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. అదేవిధంగా కిచెన్ నీట్‌గా కనిపించాలంటే ఎప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నం, కూరలను పారవేస్తూ ఉండాలి.
ఇకపోతే వారానికోసారైనా తరచూ వాడే రిఫ్రిజిరేటర్, ఒవెన్.. వంటి వస్తువులను క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేసుకోవాలి. అలాగే.. గ్యాస్ స్టౌ బర్నర్స్‌ని కూడా వారానికోసారైనా క్లీన్ చేసుకోవాలి. ఫలితంగా స్టౌ శుభ్రంగా కనిపించడమే కాకుండా మంట పెద్దగా వచ్చి గ్యాస్‌ని ఆదా చేసుకోవచ్చు. గ్యాస్ స్టౌ దగ్గర ఉండే టైల్స్‌ని కూడా వారంలో ఒక రోజు బేకింగ్ సోడా యూజ్ చేసి తుడుచుకుంటే మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కనిపిస్తూ తళతళ మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.
కిచెన్‌లో గిన్నెలు, ప్లేట్లే కాదు.. ఇవి కూడా క్లీన్ చేయాలి! - లేకపోతే బ్యాక్టీరియా ముప్పు!