ETV Bharat / politics

12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాల్లేవు : హరీశ్ రావు - HARISH RAO HOME GUARD SALARIES

ప్రభుత్వం హోంగార్డు జీతాలను చెల్లించడంలేదని హరీశ్ రావు ట్వీట్ - రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడిందన్న హరీశ్ రావు

Home Guards Salaries
Harish Rao Tweet On Home Guards Salaries (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 1:51 PM IST

Harish Rao Tweet On Home Guards Salaries : రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎక్స్‌ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం హోంగార్డులు అప్పులు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారని అన్నారు.

జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరని మాజీమంత్రి హరీశ్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

"హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. వారి ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతుంది. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి గారు వీరికి ఏం సమాధానం చెబుతారు? పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం." -హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

రైతులకు రెండు సార్లు రైతు భరోసా ఇవ్వకుంటే ఊరుకునేది లేదు: హరీశ్​రావు

కేసీఆర్ పాలనలో 'ఇరిగేషన్' పెరిగితే - రేవంత్ పాలనలో 'ఇరిటేషన్' పెరిగింది: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.