ETV Bharat / offbeat

రవ్వ లేకుండా బియ్యంతో "ఇడ్లీలు" - ఇలా చేసుకుంటే రుచితో పాటు సూపర్​ సాఫ్ట్​! - HOW TO MAKE RICE IDLI AT HOME

-ఇడ్లీరవ్వ లేకుండా బియ్యంతోనే మృదువైన ఇడ్లీలు -ప్రిపేర్​ చేయడం కూడా వెరీ సింపుల్​

How to Make Rice Idli at Home
How to Make Rice Idli at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 1:53 PM IST

How to Make Rice Idli at Home: మెజార్టీ జనాల ఇంట్లో మార్నింగ్​ టిఫెన్​గా ఇడ్లీ ఉంటుంది. ఎందుకంటే ఇది లైట్​గా ఉండి ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ప్రిపేర్​ చేసుకోవడం కూడా చాలా తేలిక. అందుకే చాలా మంది వారానికి ఓ రెండు మూడు రోజులైనా ఇడ్లీలు చేసుకుని తింటుంటారు. ఇక ఇడ్లీలు చేయాలంటే ఇడ్లీరవ్వ కచ్చితంగా ఉండాల్సిందే.

అందుకు అనుగుణంగానే మార్కెట్​కు వెళ్లినప్పుడు కేజీల కొద్దీ ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు. అయితే ఇడ్లీ రవ్వ లేకుండా కేవలం బియ్యంతో కూడా రుచికరమైన, మృదువైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. పైగా ఇవి ప్రిపేర్​ చేసుకోవడం చాలా ఈజీ. మరి లేట్​ చేయకుండా రైస్​ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • మినపప్పు - 1 కప్పు(200 గ్రాములు)
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • రేషన్​ బియ్యం - 3 కప్పులు(600 గ్రాములు)
  • అటుకులు - అర కప్పు
  • సన్నటి గోధుమ రవ్వ - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • బియ్యంతో ఇడ్లీలు చేయాలంటే ముందు రోజు రాత్రి ఇడ్లీ పిండిని ప్రిపేర్​ చేసుకోవాలి. ఎందుకంటే పిండి పులిస్తేనే ఇడ్లీలు చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి పిండిని ముందే సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్​లోకి మినపప్పు, మెంతులు తీసుకుని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • మరో గిన్నెలోకి రేషన్​ బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని కూడా సేమ్​ 5 గంటలపాటు నాననివ్వాలి.
  • మినపప్పు, బియ్యం బాగా నానిన తర్వాత మరోసారి రెండింటిని విడివిడిగా కడగాలి. అలాగే పిండి గ్రైండ్​ చేసుకునే ఐదు నిమిషాల ముందు ఓ గిన్నెలోకి అటుకులు, కొన్ని నీళ్లు పోసి నాననివ్వాలి.
  • మిక్సీజార్​ తీసుకుని మినపప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటా వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీజార్​లోకి నానబెట్టిన అటుకులు, నానబెట్టిన బియ్యం కొన్ని వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ అటు మరీ మెత్తగా, మరీ బరకగా కాకుండా చేతితో పట్టుకుంటే సన్నటి రవ్వలాగా అనిపించేలా గ్రైండ్​ చేసుకోవాలి. ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని మినపప్పు పిండి వేసిన గిన్నెలోకి కలుపుకోవాలి. అలాగే మిగిలిన నానిన బియ్యాన్ని కూడా గ్రైండ్​ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు ఓ చిన్న గిన్నెలోకి సన్నటి గోధుమరవ్వ తీసుకుని ఓసారి కడిగి, మినపప్పు, బియ్యపిండి ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి.
  • తర్వాత మినపప్పు, బియ్యం, గోధుమరవ్వ మూడు బాగా కలిసేలా కలపాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి రాత్రి మొత్తం అలానే ఉంచాలి.
  • ఉదయాన్నే పిండి బాగా పులిసి కనిపిస్తుంది. అప్పుడు మరోసారి బాగా కలిపి, అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
  • ఈలోపు ఇడ్లీ ప్లేట్స్​కు నూనె లేదా నెయ్యి రాసుకుని పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్​లోకి పిండిని వేసుకోవాలి.
  • ఇడ్లీ పాత్రలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్​ పెట్టి మూత పెట్టాలి. ఆపై మంటను మీడియంలో ఉంచి 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఓ 5 నిమిషాల తర్వాత ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుని పల్లీ చట్నీ, కారప్పొడితో తింటే సూపర్​గా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి!

ఇడ్లీ పిండితో రుచికరమైన "పునుగులు" - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతాయి!

పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.