ETV Bharat / entertainment

బన్నీకి రౌడీబాయ్ స్పెషల్ గిఫ్ట్- వీళ్ల బాండింగ్ సూపరో సూపర్! - ALLU ARJUN PUSHPA 2

బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన రౌడీబాయ్- ఇద్దరి బాండింగ్ సూపరో సూపర్!

Vijay Gift Allu Arjun
Vijay Gift Allu Arjun (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 10:33 PM IST

Vijay Devarakonda Gift Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రమోషన్స్​లో బిజీ బిజీగా ఉన్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బన్నీకి ఇండస్ట్రీ నుంచి పలువురు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. దానికి అల్లు అర్జున్ కూడా స్పందించి విజయ్​కు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అది ఏ గిఫ్ట్ అంటే?

బన్నీకి విజయ్ ఓ స్పెషల్ టీ షర్టును పంపించారు. దానికి వెనుక భాగంలో 'రౌడీ పుష్ప' అని రాసి ఉంది. అయితే దీన్ని విజయ్ క్లాతింగ్ బ్రాండ్ 'రౌడీ'లో డిజైన చేయించినట్లు కనిపిస్తోంది. విజయ్ బహుమతిగా పంపిన ఈ టీ షర్టు ఫొటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మై స్వీట్ బ్రదర్. మీ ప్రేమకు చాలా థాంక్స్' అని విజయ్​కు ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే దీనికి విజయ్ కూడా రిప్లై ఇచ్చారు. 'మన సంప్రదాయం ఇలాగే కొనసాగుతోంది అన్నా' అని విజయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఈ సినిమా ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. ఈ సీక్వెల్ నిడివి ఏకంగా 3 గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు మేకర్స్ అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. ​దీంతో ఇది తెలుగులో ఎక్కువ నిడివి ఉన్న మూడో సినిమాగా సినిమాగా నిలవనుంది. అత్యధిక నిడివి కలిగిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ 'దానవీరశూరకర్ణ' (3 గంటల 33 నిమిషాలు), 'లవకుశ' (3 గంటల 28నిమిషాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఇక పుష్ప విషయానికొస్తే, సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు తదితరులు ఆయా పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్, రవి నిర్మించారు. కాగా, ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్​ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

రన్​టైమ్​లోనూ 'పుష్ప 2' తగ్గేదేలే! - ఆ రికార్డ్​తో రెండు టాప్ సినిమాల బాటలోకి!

'పుష్ప 2' ఎఫెక్ట్​ - రేసు నుంచి వైదొలిగిన రష్మిక బాలీవుడ్ సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.