ETV Bharat / health

షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత సేపు వాకింగ్ చేయాలి? వారానికి అంత నడిస్తే సూపర్ బెనిఫిట్స్! - HOW MUCH SHOULD DIABETIC WALK A DAY

-మధుమేహం వ్యాధిగ్రస్థులకు వాకింగ్​తో ఎంతో లాభం -రోజుకు ఇంత నడిస్తే మేలని నిపుణులు వెల్లడి

How Much Should a Diabetic Walk a Day
How Much Should a Diabetic Walk a Day (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 28, 2024, 1:04 PM IST

How Much Should a Diabetic Walk a Day: ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ అందరికీ వ్యాపిస్తుంది. అయితే, రోజు వాకింగ్ చేయడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి? వారానికి ఎంత సమయం కేటాయించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ రోగులు వారానికి సుమారు 150 నిమిషాలు నడవాలని నిపుణులు చెబుతున్నారు. Diabetes Care జర్నల్​లో ప్రచురితమైన Stepping Up to Diabetes The Power of Walking అనే అధ్యయనంలో తేలింది. ఇందులో American Diabetes Association చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. వారంలో కనీసం అయిదు రోజుల పాటు రోజుకి 30 నిమిషాలు నడిస్తే మంచిందని వివరించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఒకవేళ రోజులో ఒకేసారి అరగంట వాకింగ్ చేసేందుకు సమయం లేని వారు దాన్ని భాగాలుగా విభజించుకోవాలని చెబుతున్నారు. వాకింగ్ చేసినప్పుడల్లా 10 నిమిషాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వాకింగ్ చేసే సమయంలో గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయులు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు వీలుగా భోజనం అనంతరం పది నిమిషాలు షార్ట్ వాక్​ చేయాలని అంటున్నారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అనంతరం కనీసం పది నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఇంకా కనీసం రోజుకు 5వేల అడుగులు వేసేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని 7వేల నుంచి 10వేలకు పెంచాలని సూచించారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనారోగ్యాలు దరిచేరుకుండా ఉంటాయని వివరించారు.

ఈ క్రమంలోనే ముందుగా జాయింట్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు సమాంతరంగా ఉన్న నేలపై నడవాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత రాళ్లలో, మెట్లు ఎక్కి దిగుతూ ఉండాలని చెబుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్​కు ప్రత్యేక సమయం కేటాయించాలని అంటున్నారు. ఇంకా కొన్ని అధ్యయనాలు రోజుకు 45 నిమిషాల నుంచి గంట వరకు వాకింగ్ చేయాలని చెబుతున్నాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు 6-6-6 రూల్ తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే గుండె సమస్యలు అసలే రావట!

రోజు అరగంట వాకింగ్ చేస్తే సూపర్ ఫిజిక్ మీ సొంతం! ఇంకా ఎన్నో లాభాలట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.