ETV Bharat / state

పర్యావరణంపై ప్రేమ ఉంటే ఈ గ్రీన్ జాబ్స్‌ మీ కోసమే!

పర్యావరణానికి హాని జరగకుండా సహజ వనరులను కాపాడే పచ్చని కొలువులు - కొత్తగా జాబ్‌ మార్కెట్‌లో అడుగుపెట్టే వారిని ఆకర్షిస్తున్న గ్రీన్​ జాబ్స్​

GREEN JOBS DEMAND ACOSS INDIA
Demand Increases For Green Jobs in India (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Demand Increases For Green Jobs in India : ప్రస్తుతం ఉన్న పలు రకాలైన ఉద్యోగాల్లో కొన్నింటి ద్వారా ఏదో ఒక రకంగా పర్యావరణానికి హాని జరిగే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇటువంటి అవకాశాలు కచ్చితంగా లేకుండా పూర్తిగా పుడమికి మేలు చేసేలా దోహదపడుతూ సహజ వనరులను కాపాడే ఉద్యోగాలను గ్రీన్​ జాబ్స్​ అంటున్నారు. ప్రస్తుతం వీటిలో నిపుణులకు చాలా డిమాండ్​ ఉంది. ఇప్పటికే పలు పరిశ్రమలు తక్కువ వాతావరణ మార్పులకు కారణమయ్యే విధానాలనే ఎంపిక చేసుకుంటున్నాయి. పని తీరు, ఉత్పత్తులను పర్యావరణ హితంగా ఉండేలా మార్చుకుంటున్నాయి. మళ్లీ ఉపయోగించుకునే వనరులను వాడటం, తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలు వచ్చేలా నూతన ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్తగా జాబ్‌ మార్కెట్‌లో అడుగుపెట్టే వారిని గ్రీన్‌ రంగంలోని కొలువులు ఆకర్షిస్తోంది. సహజ వనరుల వినియోగం తగ్గించి క్లీన్​ ఎనర్జీని తయారు చేసే పరిశ్రమలు, ఎలక్ట్రానిక్​ వాహనాలు తయారు చేసే పరిశ్రమలు.. ఇటువంటి వాటిలో ఉండే ఉద్యోగాలను గ్రీన్‌ కెరియర్లుగా అంటున్నారు. పర్యావరణ హితంగా ఉండే ఉద్యోగాల్లో అగ్రికల్చర్‌ స్పెషలిస్టులు, ఎన్విరాన్‌మెంట్‌ టెక్నీషియన్లు, గ్రీన్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్స్, విండ్‌ టర్బైన్‌ - సోలార్‌ ప్యానెల్‌ టెక్నీషియన్లు, న్యూక్లియర్‌ ఇంజినీర్స్‌ ఇలా ఇంకా చాలా రకాలైన ఉద్యోగాలు ఉంటున్నాయి.

ప్రభుత్వ రంగంలోనూ..

ప్రస్తుతం దేశంలో నేషనల్‌ సోలార్‌ మిషన్‌, స్మార్ట్‌ సిటీ మిషన్ వంటి పలు పథకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇటువంటి వాటికి గ్రీన్​ స్కిల్క్​ ఉన్న నిపుణులు చాలా అవసరం అవుతున్నారు. దేశంలో గ్రీన్‌ జాబ్‌ సెక్టార్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది మిగతా ప్రపంచంతో భారత ఆర్థిక, పర్యావరణ ప్రణాళిక వ్యూహాల్లో ఒక భాగం. ప్రపంచం గ్లోబల్‌ సవాళ్లు ఎదుర్కొనేకొద్దీ, జీవవైవిధ్యం, సహజ వనరులు తగ్గిపోవడం వంటి జరిగేకొద్ది గ్రీన్​ కెరియర్లు మరింత అవసరం పడుతుంది. ఇవి పర్యావరణం పట్ల సానుకూలంగా పనిచేస్తాయి. సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిసోర్స్‌ కన్జర్వేషన్‌ పలు విధాలుగా పర్యావరణానికి మంచి చేస్తాయి. 2070 కల్లా సున్నా కర్బన ఉద్గారాల దిశగా భారతదేశం పయనిస్తోంది.

  • 2030 నాటికి విద్యుత్తు వాహనాల రంగంలో మరిన్ని మార్పులు, అభివృద్ధి జరగాలి అన్నదే భారత్​కు ఉన్న మరో లక్ష్యం. పర్యావరణ సుస్థిరతకు పాటుపడే గ్రీన్‌ గంగా మిషన్‌ కూడా ఇదే కోవకు చెందుతాయి. ప్రస్తుతం ఉన్న పర్యావరణ ఇబ్బందులన్నీ తప్పించేలా ఇవన్నీ ఉండబోతున్నాయి.
  • అధికారిక లెక్కల ప్రకారం పరిశ్రమల్లో వస్తున్న ప్రతి మార్పు ఏటా కొత్త ఉద్యోగాల తయారీకి నాంది పలుకుతోంది. ఇండియాలో 2025 సంవత్సరం పూర్తయ్యే సరికి దాదాపు 30 లక్షలు గ్రీన్​ ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది జరిగితే పూర్తిగా భారత గ్రీన్‌ ఎకానమీ మార్పులకు లోనవుతుందని ఒక అంచనా.

ఇంటర్న్‌షిప్స్‌ సైతం..

సస్టెయినబిలిటీ పరిశ్రమ ప్రపంచాన్ని కొత్తగా ఆక్రమించుకుంటోంది. తాజాగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఐ) దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన లక్ష మంది విద్యార్థులకు స్కాలర్​షిప్పులు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కొత్తగా గ్రీన్​ జాబ్స్​ పుట్టుకొస్తున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే ఆ కొలువులకు తగ్గట్లు అనుభవం అవసరం. వీటిని విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసీటీఐ సేల్స్‌ఫోర్స్, గ్రీన్‌ స్కిల్స్‌ అకాడమీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్నరోజుల్లో ఈ కెరియర్లకు మరింత డిమాండ్​ పెరుగుతుందనడానికి ఇదే ఓ ఉదాహరణ.

ముఖ్యమైన రంగాలు

  • సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, రవాణా, రీసైక్లింగ్‌- వేస్ట్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ - అడ్మినిస్ట్రేషన్‌, టెక్నాలజీ.
  • వీటిలో ప్రయత్నించేందుకు కనీసం గ్రాడ్యుయేషన్​తోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు, సమస్యా పరిష్కారం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి అవసరం.

ఏం చదవొచ్చు ?

సోలార్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌ : సోలార్‌ ఎనర్జీ రంగంలో ఇంజినీరింగ్​ అర్హతతో అవకాశాలున్నాయి. గృహ సముదాయాలు, భవంతులు వంటి వాటికి సోలార్‌ ఎనర్జీ ఎంతో అవసరం అవుతోంది. ఈ ఇంజినీర్లు సోలార్‌ పవర్డ్‌ డివైజ్‌లు, సోలార్‌ ప్యానెల్స్, గైడెన్స్‌ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్స్, హీటింగ్‌ - ఎయిర్‌ కండిషన్డ్‌ సిస్టమ్స్, ఆటోమొబైల్స్‌తో పనిచేస్తారు. దాదాపు చాలా మంది ప్రైవేట్​ సంస్థల్లో అవకాశాలు పొందుతున్నారు.

జియోఫిజికల్‌ ఇంజినీరింగ్‌ : జియోఫిజికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో ఉన్న వారు ఒక చోట నుంచి వనరులను బయటకు తీసేందుకు భద్రమైన, ఉపయోగవంతమైన విధానాలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తారు. దానితోపాటు మైనింగ్​ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఉత్పత్తి, పనితీరును మెరుగుపరచడంలో వీరి అవసరం చాలా ఉంటుంది.

విండ్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌ : విండ్‌ ఫార్మ్స్‌ నమూనాలు తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయడం వంటివి చేస్తుంటారు. ఇందులో విభిన్న రకాలైన ఇంజినీర్లే కాకుండా మెకానికల్, ఏవియేషన్, సాఫ్ట్‌వేర్, ఎకాలజిస్ట్‌, ఎలక్ట్రీషియన్ వంటి పలు ఉద్యోగాలు ఉన్నాయి.

  • ఇంతేకాకుండా ఎన్విరాన్‌మెంటల్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, కన్జర్వేషన్‌ సైన్స్, జువాలజీ, రీసైక్లింగ్‌ కోఆర్డినేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ - ప్లానింగ్, ప్రమాదకరమైన మెటీరియల్‌ వర్క్, గ్రీన్‌ డేటా అనలైజేషన్, కంప్యూటర్‌ ఇంజినీరింగ్, గ్రీన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, వెబ్‌ డిజైన్, ఎనర్జీ ఆడిటింగ్, ఆర్బిట్రేషన్‌ - మీడియేషన్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, కన్‌స్ట్రక్షన్‌ ఇన్‌స్పెక్షన్‌, పవర్‌ ప్లాంట్‌ ఆపరేషన్ వంటి అంశాల్లో పరిజ్ఞానం సంపాదిస్తే ఈ కొలువుల్లోకి వెళ్లవచ్చు.
  • ప్రాథమిక స్థాయి ప్రవేశాలకు డిగ్రీ, ఆపైన పీజీ, పీహెచ్‌డీతో ఉన్న స్థాయికి కూడా వెళ్లే వీలుంటుంది. ప్రాథమిక అవగాహన కోసం పలు లెర్నింగ్​ ప్లాట్​ఫార్మ్స్​లో ఉన్న ఆన్​లైన్​ కోర్సులు ఉపయోగపడతాయి.
  • గ్రీన్​ జాబ్​ రంగంలోకి వెళ్లాలనుకునే వారికి అప్రెంటిస్‌షిప్‌ ప్రధానమైన మార్గం. దీనితో వివిధ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఇందులో బిజినెస్‌ సస్టెయినబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెన్సీ, విండ్‌ టర్బైన్‌ టెక్నాలజీ ఫారెస్ట్రీ వంటి అనేక అంశాలున్నాయి.

సెమీ కండక్టర్‌ పరిశ్రమలో భారీ ఉద్యోగ అవకాశాలు - మరి సాధించడం ఎలా?

కనీస అర్హత ఉన్నా విదేశాల్లో మీకు లక్షల జీతంతో జాబ్ గ్యారెంటీ - ఎలాగో తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.