డిస్టిలరీల నుంచి అనధికారిక మద్యం రూవందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి! Telangana Excise Department Focus on liquor Scam : మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ ఆబ్కారీశాఖ నుంచి వచ్చే వ్యాట్ ఆదాయం పెరగాలి. కానీ రాష్ట్రంలో అలా జరగడం లేదు. ఈ విషయం గమనించిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కె.శ్రీదేవి అధికారులతో సమీక్ష చేసినప్పుడు పలు అనుమానాలు రావడంతో లిక్కర్ అమ్మకాలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవల రెండు బేవరేజ్‌లను తనిఖీ చేసి ఆడిట్ నిర్వహించారు. లిక్కర్ ఉత్పత్తికి వాడే నీరు, కరెంటు, ముడి సరుకు లెక్కలు పరిశీలిస్తే కాగితాల్లో చూపిన దానికంటే ఎక్కువ లిక్కర్ తయారు చేసినట్లు తేలింది.
ఒక్క ఏడాదికి కోటి 30 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తి చేసినట్లు లెక్కలు చూపగా ముడి సరుకు, నీరు, విద్యుత్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారీగా తేడాలు గుర్తించినట్లు సమాచారం. ఒక్క డిసిల్లరీలోనే ఏడాదికి దాదాపు రూ.130 కోట్లకుపైగా విలువైన 12.50 లక్షల లీటర్లు తేడా వచ్చినట్లు సమాచారం. ఈ మొత్తంపై వాణిజ్య పన్నుల శాఖకు 70 శాతం వ్యాట్ కింద సర్కార్‌కు రూ.90 కోట్లు వరకు గండి పడినట్లు అంచనా వేసింది. ఈ మద్యం ఎటు వెళ్లిందనే విషయంపై డిస్టిలరీ యజమాని నుంచి ఎలాంటి సమాధానం లేనట్లు తెలుస్తోంది.
Unauthorized Liquor From Distilleries Telangana : 26 ఉత్పత్తి కేంద్రాలలో సగానికి సగం బేవరేజెస్ అయినా నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్ (Alcohol in Telangana) అమ్మి సొమ్ము చేసుకుని జేబులు నింపుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. అక్రమ మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన వాణిజ్య పన్నుల శాఖ గడిచిన ఆరేళ్లు, అంతకు మించి రికార్డులు తనిఖీలు ముమ్మరం చేసి ఖజానాకు ఎన్ని వందల కోట్లు గండి పడిందో తేల్చేపనిలో పడింది.
విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం
రాష్ట్రంలో 2వేల 620 మద్యం దుకాణాలు, 1,186 బార్లు, 27 క్లబ్‌లు ఉన్నాయి. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి లిక్కర్ సరఫరా అవుతుంది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు, ఆరు బేవరేజ్లే కాకుండా ఇతల లిక్కర్ల డిమాండ్ పెరిగినప్పుడు బయట రాష్ట్రాల నుంచి కూడా మద్యం దిగుమతి చేసుకుంటారు. కానీ వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి మద్యం వచ్చినా రాష్ట్రంలోని డిస్టిలరీల మద్యమైనా రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ డిపోల ద్వారానే దుకాణాలు, బార్లు, క్లబ్‌లకు సరఫరా అవ్వాలి. అంటే డిపోల్లో ఈ మద్యం ధరలకు 70శాతం వ్యాట్‌ను కలిపి ఎమ్ఆర్పీ లేబులింగ్ ఇస్తారు. ఈ సొమ్ము అబ్కారీ శాఖ ప్రతి నెల వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల మద్యం తయారీ దగ్గరనే బ్రాండ్‌ను బట్టి లీటర్‌కు ఇంత అని ఎక్సైజ్ డ్యూటీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Illegal liquor Making in Telangana :డిస్టిలరీలు, బేవరేజ్లో లిక్కర్ తయారీకి ముడి సరుకు దగ్గర నుంచి బాటిల్ బయట వచ్చే వరకు ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. అంతా సవ్యంగా జరిగితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఢోకా ఉండదు. కానీ గత ప్రభుత్వ హయాంలో అబ్కారీశాఖ (Telangana Excise Department) అధికారుల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. అనుకూలమైన వారిని పోస్టింగుల్లో వేసుకుని వాళ్లకు నచ్చినట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముడి సరుకు, ఉత్పత్తి అవుతున్న మద్యం, అక్కడ నుంచి డిపోలకు సరఫరా అవుతున్న లిక్కర్‌కు పొంతెన ఉండడం లేదు.
పలుకుబడి కలిగిన కొన్ని డిస్టలరీలు మద్యాన్ని నేరుగా దుకాణాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో అనధికారిక లిక్కర్ ఉన్నట్లు తనిఖీల్లో బయట పడినా కేసు పెట్టకుండా లోతుగా విచారణ చేయకుండా ఉన్నత స్థాయిలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారిని నాన్ ఫోకల్ పాయింట్‌కి బదిలీ చేసినట్లు విస్వసనీయ సమాచారం. తెరవెనుక బడాబాబులు ఉండడంతో కేసులు ముందుకు వెళ్లకుండా ఎక్కడికి అక్కడ అడ్డుకుంటారని ఆబ్కారీ శాఖ అధికారులే చెబుతున్నారు.
ఆదాయం పెంచుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్ - ఎలైట్ బార్లు, దుకాణాల ఏర్పాటుకు కసరత్తులు!
ఒక్క టానిక్ వైన్స్‌లోనే రూ.1000 కోట్ల 'పన్ను ఎగవేత' లావాదేవీలు!