Telangana Heavy Rains: రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో 16 జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాటి వివరాలను తెలిపింది. ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Hyderabad IMD Weather Report: రాష్ట్రంలో గురువారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు గాలుల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం ఉందని సూచించింది.