ETV Bharat / state

తిరుమలలో భక్తులకు "కంకణం" - 2 గంటల్లోనే దర్శనం! - మీకు తెలుసా? - TTD KANKANA DARSHAN

- మళ్లీ మొదలు పెడతారా?

Kankanam Darshan History at Tirumala
Kankanam Darshan History at Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 5:22 PM IST

Kankanam Darshan History at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలు మూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అందుకే తిరుమల కొండ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మరింతగా కిక్కిరిసిపోతుంది. భక్తులు ఎక్కువగా ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూకాంప్లెక్స్‌లోనే, సుమారు 30 గంటలపాటు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే దర్శనం త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ గతంలో పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో కొన్ని రద్దు కాగా, మరికొన్ని కొత్తవి అమల్లోకి వచ్చాయి.

దర్శనాలు పలు రకాలు :

  • భక్తులకు పలు రకాల దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. సర్వ దర్శనం మొదలు, వీఐపీ దర్శనం వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇందు కోసం రూ.300 టికెట్ కొనుగోలు చేయాలి.
  • ప్రత్యేక దర్శనం అని మరో దర్శనం ఉంది. ఈ టికెట్ ఖరీదు రూ.10,500
  • ఇంకా ఆర్జిత సేవలు, సర్వదర్శనం, స్లాట్‌ దర్శనం, అంటూ పలు రకాలు ఉన్నాయి.
  • స్లాట్‌ దర్శనం ద్వారా రెండు, మూడు గంటల్లోనే స్వామి దర్శనం కలుగుతుంది. విష్ణునివాసం, శ్రీనివాసంలో ఆధార్‌ ప్రకారం దర్శన సమయం కేటాయిస్తారు. కానీ ఈ టికెట్లు పరిమితంగానే ఉంటాయి.
  • శ్రీవారి మెట్టు, అలిపిరి నుంచి కాలి నడకన వచ్చే వారికోసం గతంలో "దివ్యదర్శనం" పేరుతో కొన్ని టికెట్లు ఇచ్చేవారు. వీటితో 2 నుంచి 3 గంటల్లోనే స్వామి దర్శనం జరిగేది. కానీ, గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.

లఘుదర్శనం :

  • 30 ఏళ్ల కిందట వరకు సామాన్య భక్తుడు కూడా స్వామి వారి మూలవిరాట్‌ను అత్యంత దగ్గర్నుంచి దర్శించుకునేవారు. అంటే, కులశేఖరపడి దాకా వెళ్లి స్వామి దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు ఆ దర్శనం లేదు. ప్రస్తుతం వీఐపీ దర్శనం, రూ.10,500 టికెట్​ కొనుగులో చేసిన వారిని మాత్రమే అక్కడి వరకూ అనుమతిస్తున్నారు.
  • ఆ తర్వాత కాలంలో "లఘుదర్శనం" అని మరో విధానం తెచ్చారు. ఈ విధానంలో గరుడాళ్వార్‌ సన్నిధి నుండి జయవిజయులను దాటి, స్నపన మండపం దాకా వెళ్లి స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండేది.
  • అనంతర కాలంలో ఈ పద్ధతిని కూడా రద్దు చేసి, గరుడాళ్వార్‌ సన్నిధి వరకు మాత్రమే భక్తులను వెళ్లనిస్తున్నారు. ఈ పద్ధతికి "మహాలఘు దర్శనం" అని పేరు పెట్టారు.
  • అయితే లఘు దర్శనం అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. పాలక మండలి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

భక్తులకు "కంకణం"

  • సుమారు 20 ఏళ్ల క్రితం ఐవీ సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు "కంకణ" పద్ధతిని ప్రవేశపెట్టారు.
  • భక్తులందరికీ చేతికి రిస్ట్‌బాండ్‌ మాదిరిగా ఒక కంకణం ట్యాగ్‌ చేసేవారు. ఈ కంకణం వాటర్‌ప్రూఫ్‌ మాదిరి ఉంటుంది.
  • తిరుపతిలోని పలు కేంద్రాలతోపాటు, రేణిగుంట వంటి ప్రాంతాల్లో కూడా ఈ కంకణం వేసేవారు.
  • ఈ కంకణం వేసేటప్పుడు భక్తులకు దర్శన సమయం కేటాయిస్తారు. అలా కేటాయించిన సమయానికి వెళ్లి, కేవలం రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం పూర్తి చేసుకొని వచ్చేవారు.
  • ఈ పద్ధతిని తిరిగి అమలు చేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.