Arshdeep Singh T20 Record : టీమ్ఇండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ కెరీర్లో అద్భుత రికార్డ్ సృష్టించాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ రికార్డు సాధించాడు. 2.5 ఓవర్ వద్ద బెన్ డకెట్‌ను పెవిలియన్ పంపిన అర్షదీప్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం అర్షదీప్ 61 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు నేలకూల్చాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
- అర్షదీప్ సింగ్ - 97 వికెట్లు (61 మ్యాచ్‌లు)
- యుజ్వేంద్ర చాహల్ - 96 వికెట్లు (80 మ్యాచ్‌లు)
- భువనేశ్వర్ కుమార్- 90 వికెట్లు (87 మ్యాచ్‌లు)
- జస్ప్రీత్ బుమ్రా - 89 వికెట్లు (70 మ్యాచ్‌లు)
- హార్దిక్ పాండ్య - 89 వికెట్లు (110 మ్యాచ్‌లు)
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జాస్ బట్లర్ (68 పరుగులు, 44 బంతుల్లో) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4), లివింగ్‌స్టోన్ (0), జకొబ్ బెతేల్ (7) జిమ్మి ఓవెటన్ (7) వరుసగా విఫలమయ్యారు. తొలుత అర్షదీప్ సింగ్ వికెట్ల వేట ప్రారంభించగా, తర్వాత వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చాడు.
Arshdeep Singh 🤝 Rinku Singh
— BCCI (@BCCI) January 22, 2025
Second success with the ball for #TeamIndia! 👍 👍
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs
#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UyEHmitcCB
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌కే రెండు వికెట్లు కోల్పోయినా, ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 7 ఓవర్లకే జట్టు స్కోర్ 60 దాటింది. ఇక ఎనిమిదో ఓవర్లో వరుణ్, హ్యారీ బ్రూక్ (17 పరుగులు), లివింగ్ స్టన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాచ అక్షర్ లైన్లోకి వచ్చాడు. ఇలా టీమ్ఇండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. వరుణ్‌కు 3 వికెట్లు దక్కగా, అర్షదీప్ , హార్దిక్ పాండ్య , అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Innings Break!
— BCCI (@BCCI) January 22, 2025
A fantastic bowling performance from #TeamIndia! 👌 👌
3⃣ wickets for Varun Chakaravarthy
2⃣ wickets each for Arshdeep Singh, Axar Patel & Hardik Pandya
Over to our batters now! 👍 👍
Scorecard ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FR7hcacPsH
ఇంగ్లాండ్‌తో సిరీస్- సూర్య, అర్షదీప్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు- తొలి ప్లేయర్‌గా నిలిచే ఛాన్స్!
టీ20 ర్యాంకింగ్స్‌లో అర్షదీప్ రేర్ రికార్డు - టాప్-10లోకి ఫస్ట్‌టైమ్!