ETV Bharat / offbeat

పంచదారను టీ/కాఫీల్లోనే కాదు ఇలానూ వాడొచ్చు! - ప్రయోజనాలు తెలిస్తే మీరూ తప్పక ట్రై చేస్తారు! - SUGAR HOME HACKS

చక్కెరతో ఎన్నో ఇతర ప్రయోజనాలు - దుస్తుల మరకల నుంచి పాత్రల శుభ్రం వరకు!

CREATIVE USES FOR SUGAR
Sugar Home Hacks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 12:15 PM IST

Sugar Home Hacks : మనం నిత్యం ఉపయోగించే పదార్థాల్లో ఒకటి పంచదార. రోజూ టీ, కాఫీలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీన్ని తప్పనిసరిగా వాడుతుంటాం. అలాగే, తీపి వంటకాలు చేసుకునే క్రమంలో చక్కెరని యూజ్ చేస్తుంటాం. కానీ, మీకు తెలుసా? పంచదారను టీ, కాఫీ, వంటకాల రుచిని పెంచడానికి మాత్రమే కాదు నిత్య జీవితంలో వివిధ పనుల కోసం వినియోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఏ ఏ పనుల కోసం చక్కెర ఉపయోగపడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరకలు మాయం!

మనం గార్డెన్‌లో పని చేస్తున్నప్పుడు బట్టలకు మట్టి అంటుకోవడం కామన్. అలాంటి మరకలను పోగొట్టడంలో చక్కెర బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం గోరువెచ్చటి వాటర్​లో కాస్త పంచదార వేసి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని మరక ఉన్న చోట అప్లై చేసి గంట పాటు పక్కనుంచాలి. అనంతరం వాష్ చేస్తే సరిపోతుంది. అలాగే, చేతులకు గ్రీజు అంటుకున్నప్పుడు ఒక్కోసారి ఎంత కడిగినా జిడ్డు అంత ఈజీగా పోదు. అప్పుడు లిక్విడ్ హ్యాండ్‌వాష్‌లో కొద్దిగా చక్కెర వేసి ఆ మిశ్రమంతో హ్యాండ్ వాష్ చేసుకుంటే గ్రీజు మరకలు సులువుగా పోతాయంటున్నారు.

వెండి వస్తువులను మెరిపించవచ్చు!

వెండి వస్తువులు ఉప్పు, గాలి, నీరు కారణంగా కొన్ని రోజులకు మెరుపును కోల్పోతాయి. అప్పుడు చక్కెరతో ఇలా చేశారంటే కొత్తవాటిలా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక బౌల్​లో 3 టేబుల్ స్పూన్ల పంచదార, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమంతో వెండి వస్తువులను కడిగితే సరి. అవి మునుపటి మెరుపుని పొంది తళతళలాడతాయట.

తుప్పు పోగొట్టడంలో!

సామాన్లకు పట్టిన తుప్పును వదిలించడంలో పంచదార చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు. దీనికోసం చిన్న బౌల్​లో ఒక నిమ్మచెక్క రసం, 3 టేబుల్‌స్పూన్ల చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తుప్పు పట్టిన వస్తువులపై వేసి కడిగితే అవి ఈజీగా క్లీన్ అవుతాయంటున్నారు నిపుణులు.

బ్యాడ్​స్మెల్ ఇట్టే పోగొడుతుంది!

కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్లు, ఇతర డబ్బాలు వంటివి చాలా రోజులు వాడకుండా మూతపెట్టి అలాగే ఉంచడం వల్ల కొన్ని రోజులకు వాటి నుంచి అదో రకమైన బ్యాడ్ స్మెల్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఆ వాసనను తొలగించడానికి పంచదార చాలా బాగా ఉపకరిస్తుందంటున్నారు నిపుణులు. అందుకోసం కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్ల వంటి వాటిలో పావు కప్పు షుగర్ వేసి కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. అనంతరం కడిగేస్తే చాలు. ఇలా చేయడం వల్ల అందులోని వాసనను పంచదార పీల్చేసుకుంటుంది. ఇక ఇతర డబ్బాల నుంచి బ్యాడ్​స్మెల్ వస్తున్నట్లయితే ఒక టీస్పూన్ చక్కెరను వాటిలో వేసి క్లోజ్ చేయాలి. తిరిగి ఆ బాక్సులను వాడే ముందు శుభ్రంగా కడిగితే బెటర్ రిజల్ట్ ఉంటుందంటున్నారు.

ఫ్లోర్‌పై మరకలు పడ్డాయా?

టైల్స్‌పై పడిన మరకలను పోగొట్టడంలో పంచదార చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 4 టేబుల్‌స్పూన్ల వెనిగర్, కొద్దిగా పంచదార తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమంలో దూదిని ముంచి, మరక ఉన్న చోట రుద్దితే చాలు. మరక ఇట్టే వదిలిపోతుందంటున్నారు.

మరికొన్ని విధాలా!

  • పాత్రలను శుభ్రపర్చడానికి చక్కెర చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం 3 టేబుల్ స్పూన్ల చక్కెరకు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలిపి కొన్ని నీళ్లు పోసి చిక్కగా చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమంతో పాత్రలను క్లీన్ చేసుకున్నారంటే అవి తళతళా మెరిసిపోతాయి.
  • ఉల్లిపాయలు కట్ చేసిన చేతులు ఓ రకమైన స్మెల్ వస్తుంటాయి. అప్పుడు టేబుల్‌స్పూన్ చక్కెరకు టీస్పూన్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ కలిపి ఆ మిశ్రమంతో చేతుల్ని వాష్ చేసుకుంటే చాలు వాసన ఇట్టే మాయమవుతుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

నిమ్మ, నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా ? - ఇలా వాడితే లెక్కలేనన్ని ఉపయోగాలు!

తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్​ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.