ETV Bharat / entertainment

నాని కోసం అనిరుధ్- 'ది పారడైజ్' మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్​ - NANI PARADISE MOVIE

నాని కొత్త సినిమా అప్డేట్- ది పారడైజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Nani Paradise Movie
Nani Paradise Movie (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2025, 12:00 PM IST

Nani Paradise Movie : నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'ది పారడైజ్'. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్​గా ఇది రూపొందుతుంది. తాజాగా మేకర్స్​ అప్డేట్ ఇచ్చారు. ముందునుంచి ప్రచారం సాగుతున్నట్లుగానే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని మేకర్స్​ అనౌన్స్​ చేశారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్​ను ఫిక్స్​ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

కాగా, ఫీమేల్ లీడ్​ కోసం కూడా మేకర్స్​ భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్​ హీరోయిన్​ను ఎంపికచేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్​ను మేకర్స్ సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. ఎస్‌ ఎల్ వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని కెరీర్​లో ఇది అత్యంత భారీ బడ్జెట్​ సినిమాగా రూపొందనుందని టాక్.

రెండో సినిమా
నాని- శ్రీకాంత్ కాంబోలో ఇది రెండో సినిమా. వీరిద్దరి కాంబోలో 2023లో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ సినిమాతో నాని రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయారు. కీర్తిసురేశ్‌, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా నాని కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని సింగ‌రేణి స‌మీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ నడిచే కథ ఇంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్‌ ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.