తెలంగాణ

telangana

ETV Bharat / state

దుస్తులు ఆరేస్తుండగా భార్యకు కరెంట్​ షాక్​ - కాపాడబోయి దంపతుల మృతి - విద్యుదాఘాతంతో భార్య భర్తలు మృతి

Couple Dies by Electrocuted in Vikarabad : బట్టలు ఆరేస్తున్న సమయంలో కరెంటు తీగలు తగిలి భార్యభర్తలిద్దరు మృతి చెందిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. మరోవైపు వరంగల్​లో జిల్లాలో వాహనం అదుపు తప్పి ఆర్మీ జవాన్​ మృతి చెందాడు.

Couple Dies by Electrocuted
Couple Dies by Electrocuted in Vikarabad

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 12:24 PM IST

Updated : Feb 26, 2024, 2:26 PM IST

Couple Dies by Electrocuted in Vikarabad :విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన సంఘటన వికారాబాద్​ జిల్లా బొంరాస్​పేట మండలం బురాన్​పూర్​లో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా పోలేపల్లి ఎల్లమ్మ జాతర సందర్బంగా బోయిని లక్ష్మి (38), లక్ష్మణ్​ (42) దంపతులు సోమవారం తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.

కరెంట్ షాక్​కు మూడు ఏనుగులు బలి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు

ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్టలను ఉతికారు. వాటిని ఆరేయటానికి వెళ్లిన లక్ష్మికి పక్కన ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ప్రమాదానికి గురైంది. లక్ష్మి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న భర్త లక్ష్మణ్​ వచ్చి భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడూ ప్రమాదానికి గురయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ విగతజీవులుగా పడి ఉండటంతో పిల్లల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

4 Years Girl Died By Touching Refrigerator in Super Market : సూపర్ మార్కెట్‌లో ఫ్రిజ్ ముట్టుకోగానే కరెంట్ షాక్​తో చిన్నారి మృతి

Soldier Dies in Road Accident in Warangal : రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దంపతులు శ్రీనివాస్, భవాని తన బంధువుల ఇంటికి వచ్చారు. తిరుగుతున్న ప్రయాణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊకల్ హవేలి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఆర్మీ జవాన్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా భవాని తీవ్రంగా గాయపడింది.

వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిన 108 సహాయంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి భవానికి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు బంధువులు తెలిపారు. సెలవుల నిమిత్తం శ్రీనివాస్ సొంత ఊరుకు వచ్చినట్లు మృతుని బంధువులు తెలిపారు.

Son Dies After the Death oF Mother in Medak : తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా కౌడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 25వ తేదీన ఉదయం తల్లి లలిత గుండేపోటుతో మరణించింది. అంత్యక్రియలు ముగిసిన కాసేపటి, ఆ తల్లి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక కుమారుడు నరేందర్​ మృతి చెందాడు. ఒకేసారి తల్లి, కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదంతో మునిగింది.

సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని వస్తుండగా ప్రమాదం - బావ, బామ్మర్ది మృతి

Last Updated : Feb 26, 2024, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details