తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్, కోహ్లీకి యూవీ ఫుల్​ సపోర్ట్ - 'వాళ్లిద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలు మర్చిపోయారు' - YUVARAJ SINGH ABOUT ROHIT AND VIRAT

ట్రోలర్స్​కు యూవీ స్ట్రాంగ్ కౌంటర్ - చెడుగా మాట్లాడటం చాలా ఈజీ, సపోర్ట్ చేయడం కష్టం

Yuvaraj Singh About Rohit And Virat
Yuvaraj Singh About Rohit And Virat (Associated Press, Getty Images)

By ETV Bharat Sports Team

Published : Jan 7, 2025, 1:48 PM IST

Yuvaraj Singh About Rohit And Virat :బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో పేలవ ఫామ్​తో అభిమానులను ఆందోళన పెట్టారు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ టెస్టుల్లో విఫలమవుతున్న ఈ ద్వయం, స్వదేశంలో కివీస్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో విఫలమై అందరినీ కలవరపెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్‌పై పలువురు మాజీలు, అలాగే అభిమానుల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జట్టు నుంచి తప్పుకోవాలంటూ మండిపడుతున్నారు. అయితే, తాజాగా టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ ఈ ఇద్దరి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

"నావరకూ ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ ఓటమి కంటే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కోల్పోవడమే బాధాకరం. ఎందుకంటే స్వదేశంలో 0-3తో వైట్‌వాష్‌ అయింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆస్ట్రేలియాలో గత రెండుసార్లు భారత్ గెలిచింది. కానీ ఈసారి ఓడింది. గొప్ప ప్లేయర్లైన విరాట్, రోహిత్​లపై కామెంట్ చేస్తున్నారు. వారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలదంరూ మర్చిపోయారు. ఈ కాలపు గొప్ప క్రికెటర్లలో రోహిత్, కోహ్లీ కూడా ఉంటారు. టీమ్ఇండియా ఓడింది. వారిద్దరూ బాగా పెర్ఫామ్​ చేయలేకపోయారు. అందుకు వారు మనకంటే ఎక్కువగానే బాధ పడుతున్నారు. కోచ్‌ గౌతమ్ గంభీర్, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్, రోహిత్, విరాట్, బుమ్రాలకు మంచి క్రికెట్ మైండ్ ఉంది. ఫ్యూచర్​లో భారత క్రికెట్‌ ఎలా ముందుకుసాగాలో వారే డిసైడ్ అవ్వాలి. బాగా ఆడకపోతే కెప్టెన్‌ స్వయంగా జట్టు నుంచి బయటకువెళ్లడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ రోహిత్ ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఇది అతడి గొప్పతనం. ఓడినా, గెలిచినా సరే అతను ఓ గొప్ప కెప్టెన్. రోహిత్ నాయకత్వంలోనే వన్డే ప్రపంచ కప్‌ వరకు వెళ్లాం. టీ20 ప్రపంచకప్ కూడా సాధించాం. ఇంకా ఎన్నో కూడా గెలుచుకున్నాం. ప్లేయర్స్ సరిగ్గా ఆడనప్పుడు వారి గురించి చెడుగా చెప్పడం సులభం. కానీ వారికి సపోర్ట్​గా నిలవడం చాలా కష్టం. వారి గురించి చెడుగా మాట్లాడటమే మీడియా పని. రోహిత్, విరాట్ నా ఫ్యామిలీ లాంటి వారు. నా కుటుంబం, సోదరులకు మద్దతుగా నిలవడం నా విధి" అంటూ యువరాజ్‌ ఆ ఇద్దరికి సపోర్ట్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details