Team India Players In Ranji Trophy : ఆస్ట్రేలియా టూర్లో భాగమై బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో ఆడిన పలువురు టీమ్ఇండియా ప్లేయర్లు ఇప్పుడు రంజీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గురువారం ప్రారంభం కానున్న విజయ్ హజారే టోర్నీ నాకౌట్ దశలో వీళ్లందరూ బరిలో దిగనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, తమిళనాడు నుంచి వాషింగ్టన్ సుందర్ తమ తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అయితే మరో కర్ణాటక ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ నాకౌట్ మ్యాచ్‌లను ఆడకుండా బ్రేక్ తీసుకోనేందుకు మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే 23న జరగనున్న రంజీ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయాన్ని తర్వాత నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ సూచన వల్లే!
అయితే తాజాగా జరిగిన బోర్డర్ గావస్కర్లో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ నేపథ్యంలో ప్లేయర్లందరూ ఫిట్‌గా, అలాగే అందుబాటులో ఉంటే కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాలని కోచ్ గంభీర్ సూచించాడు. దీంతో ఇప్పుడు వీరందరూ ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇక ప్రసిద్ధ్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్ శుక్రవారం కర్ణాటక జట్టుతో కలుస్తారు. శనివారం బరోడాతో ఆ జట్టు క్వార్టర్స్‌లో తలపడనుంది. మరోవైపు ఈ టోర్నీలో తమిళనాడు సెమీస్ చేరితేనే సుందర్ ఆ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన అతడు అందులో 114 పరుగులు స్కోర్ చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ (6 వికెట్లు), దేవ్‌దత్ పడిక్కల్ (25 పరుగులు) చెరో మ్యాచ్ ఆడారు.
రంజీల్లో సెంచరీ స్టార్
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా గడ్డపై తన అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అందరి ప్రశంసలు అందుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రంజీలోనూ తమ మార్క్‌ను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విజయ్ హజారే టోర్నీలో ఆంధ్ర నాకౌట్‌కు చేరలేకపోయింది. అయితే బుధవారం ఆసీస్ నుంచి బయల్దేరిన నితీశ్, రంజీ రెండో రౌండ్లో ఆంధ్ర జట్టులోకి చేరనున్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 23న పుదుచ్చేరి, 30న రాజస్థాన్‌తో ఆంధ్ర జట్టు పోటీపడనుంది. బోర్డర్- గావస్కర్ సిరీస్‌కు ముందు నితీశ్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.
రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన 'డబుల్ సెంచరీ హీరో'- అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఫెయిల్యూర్స్- రోహిత్, విరాట్ బాటలో ఆ ముగ్గురు కూడా!