Dhanashree Verma About Divorce Rumors : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా తనపై వస్తోన్న వార్తల కారణంగా తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"కొన్ని రోజులుగా నేను, నా ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అసలు నిజం ఎంటో తెలుసుకోకుండా అవాస్తవాలను రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావటానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. అయితే నేను మౌనంగా ఉంటున్నానంటే దానికి బలహీనంగా ఉన్నట్లు కాదు. సోషల్ మీడియాలో హేట్రడ్ ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే చాలా ధైర్యం అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని విలువలతో ముందుకుసాగాలని అనుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా సరే విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు" అని ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేశారు.
Stay strong Dhanashree ❤️ We are with you. The whole world is with you. We know how hardly you passed those toxic years. 😭
— Rudra Shashank (@AloneRudra2) January 9, 2025
Stay strong 🤟🏻 pic.twitter.com/fKSj0lgJ5T
ఏం జరిగిందంటే?
కొన్ని రోజులుగా ధనశ్రీ - చాహల్ విడిపోతున్నారంటూ వార్తలు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలను తొలగించడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే చాహల్ - ధనశ్రీ వర్మ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి దారి తీశాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవట్లేదని ఇటీవల తెలిపాడు.