Ms Dhoni Ziva Singh : భారత మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడిపుతుంటాడు. భార్య, కూతురితో సరదాగా ఉంటూ ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోతాడు. ఈ ఫొటోలు, వీడియోలు తన కుమార్తె జీవా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా మరో క్యూట్ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
ధోనీ తన కూతురు జీవాతో కలిసి తమ పెంపుడు శునకంతో గడిపిన క్షణాలను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. ధోనీ తన శునకాన్ని ప్రేమగా లాలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దాని పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ దువ్వెనతో సున్నితంగా దువ్వుతుండగా, కుమార్తె జీవా కూడా సహాయం చేసింది. తాను మరో దువ్వెన అందిస్తూ శునకంతో ఆడుతుంది. ఆ శునకాన్ని కూడా ధోనీ తమ ఫ్యామిలీ మెంబర్‌లాగా చూసుకుంటారని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ధోనీకి జంతువుల పట్ల ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Therapawtic!💛
— Chennai Super Kings (@ChennaiIPL) January 8, 2025
📹 : ziva singh dhoni pic.twitter.com/Qs4yoybB60
అయితే మిస్టర్ కూల్ ధోనీ సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అకౌంట్లు ఉన్నప్పటికీ ధోనీ ఎక్కువగా పోస్ట్‌లు షేర్ చేయడు. 2024 జులైలో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా పోస్ట్ షేర్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలని తన మేనేజర్లు పలుమార్లు సూచించినప్పటికీ ధోనీ ఆ సలహాలను లెక్కచేయలేదనని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
2025 IPLలోనే
ఇక మరో మూడు నెలల్లో ధోనీని మైదానంలో చూడవచ్చు. 2025 ఐపీఎల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలో దిగనున్నాడు. రిటెన్షన్స్‌లో ధోనీని చెన్నై అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్ల ధరకు అట్టిపెట్టుకుంది.
న్యూ ఇయర్ స్పెషల్ డ్యాన్స్
ధోనీ తన భార్య సాక్షితో కలిసి గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలో సాక్షితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
'మంచి క్రికెట్ ఆడితే, ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు'- సోషల్ మీడియాపై ధోనీ
ధోనీ ఇంట క్రిస్మస్ సందడి - శాంతాక్లాజ్‌గా సర్ప్రైజ్ చేసిన మిస్టర్ కూల్