Rohit Sharma Ind vs Eng ODI : టీమ్ఇండియా కెప్టెన్ మరో అరుదైన రికార్డ్‌కు చేరువయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్న రోహిత్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అతడు మరో 50 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 పరుగులు చేశాడు.
కాగా, ఈ లిస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు) టాప్‌లో ఉన్నాడు. సచిన్ (15,335 రన్స్) రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్ 50 రన్స్ చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య (19,298 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు
- సనత్ జయసూర్య (శ్రీలంక)- 19,298 పరుగులు (506 మ్యాచ్‌లు)
- క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 18,867 పరుగులు (441 మ్యాచ్‌లు)
- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)-18,744 పరుగులు (374 మ్యాచ్‌లు)
- గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా)- 16,950 పరుగులు (342 మ్యాచ్‌లు)
- డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్)- 354 మ్యాచ్‌లు.. 16,120 పరుగులు
- వీరేంద్ర సెహ్వాగ్ (భారత్)- 16,119 పరుగులు (332 మ్యాచ్‌లు)
- సచిన్ తెందూల్కర్ (భారత్)- 15,335 పరుగులు (346 మ్యాచ్‌లు)
- రోహిత్ శర్మ (భారత్)- 15,285 పరుగులు (342 మ్యాచ్‌లు)
అంత ప్రాక్టీస్ అవసరం లేదు
అయితే రోహిత్ ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. నెట్స్‌లో ఎంత తీవ్రంగా శ్రమించినా, మైదానంలో తేలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. స్వీయ పరిశీలన చేసుకుంటే సరిపోతుందని సూచించాడు. 'కెరీర్‌లో పరుగులు చేయని దశను ఇప్పుడు రోహిత్ అనుభవిస్తున్నాడు. దీని నుంచి బయటపడేందుకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. దాని వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. దానికి బదులు రోహిత్ ఒంటరిగా కాసేపు సమయం గడపాలి. గతంలో ఆటను ఆస్వాదించిన దశను గుర్తు చేసుకోవాలి. ఆ వీడియోలు చూడాలి. ఎక్కడ పొరపాటు చేస్తున్నాననో తెలుసుకుంటే సరిచేసుకోవడం సులువు అవుతుంది' అని అన్నాడు.
Nagpur ✅
— BCCI (@BCCI) February 8, 2025
Hello Cuttack! 👋#TeamIndia have arrived for the 2nd #INDvENG ODI @IDFCFIRSTBank pic.twitter.com/XhdtAixiyF
'రోహిత్ విరాటే కాదు ఆ ఇద్దరూ స్టార్సే! - ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు'
'నా వైఫ్ చూస్తుంది, నేను అస్సలు చెప్పను'- మంధానకు రోహిత్ షాకింగ్ ఆన్సర్