ETV Bharat / sports

రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన 'డబుల్ సెంచరీ హీరో'- అన్ని ఫార్మాట్లకు గుడ్​బై - RETIREMENT

కివీస్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్- అన్ని ఫార్మాట్లకు గుడ్​బై

Retirement
Retirement (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 18 hours ago

Martin Guptill Retirement : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు గప్టిల్ పేర్కొన్నాడు. తన కెరీర్​లో మద్దతుగా నిలిచిన కివీస్ క్రికెట్ బోర్డు, కోచ్​లు, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు గప్టిల్ థాంక్స్ చెప్పాడు.

'చిన్నప్పుడు న్యూజిలాండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాను. ఇప్పుడు 367 మ్యాచ్​ల్లో కివీస్​కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నా కెరీర్​లో నాతోపాటు ప్రయాణం చేసిన కోచ్​లు, సపోర్టింగ్ స్టాఫ్, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు'

'ముఖ్యంగా అండర్ 19 స్థాయి నుంచి నాకు కోచింగ్ ఇచ్చిన మార్క్ ఓ డొనెల్​, నా మేనేజర్ మెక్​ గోల్డ్​రిక్​కు స్పెషల్ థాంక్స్. నా భార్య లారా నా కెరీర్​, ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తను నా సపోర్టర్. ఆమెకు, నా పిల్లలు హార్లీ, టెడ్డీకు కూడా థాంక్స్. చివరగా ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్, నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని గప్టిల్ పేర్కొన్నాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన గప్టిల్ 2022 దాకా న్యూజిలాండ్​కు ప్రాతినిధ్యం వహించాడు. 13ఏళ్ల కెరీర్​లో మొత్తం 367 మ్యాచ్​ల్లో గప్టిల్ 13,463 పరుగులు (వన్డే 7346 పరుగులు, టెస్టు 2586 పరుగులు, టీ20 3531 పరుగులు) చేశాడు. అయితే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డ్ గప్టిల్ పేరిటే ఉంది. 2015 వరల్డ్​కప్​లో గప్టిల్ వెస్టిండీస్​పై డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్​లో 237 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

2009 జనవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గప్టిల్, తొలి మ్యాచ్‌లోనే 135 బంతుల్లో 122 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. దీంతో వన్డేల్లో అరంగేట్రలోనే సెంచరీ చేసిన తొలి కివీస్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మొత్తం కెరీర్​లో వన్డేల్లో 18, టెస్టుల్లో 3, టీ20ల్లో 2 శతకాలు బాదాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.