Most Dot Balls In IPL History:ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఇన్నింగ్స్. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తిపోతుంది. బ్యాటర్ ప్రతి బంతిని బౌండరీ దాటించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి వికెట్ కూడా పారేసుకుంటాడు. అయితే ఐపీఎల్ అంటే బ్యాటర్ల మెరుపులే కాదు, బౌలర్ల బుల్లెట్ లాంటి బంతులు కూడా ఉంటాయి. అలా ఐపీఎల్ చరిత్రలో చాలా మంది బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చెక్ పెట్టిన సందర్భాలున్నాయి. అలా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్‌బాల్స్ వేసిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం.
- భువనేశ్వర్ కుమార్:భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ జట్టులో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అతడు 160 మ్యాచ్‌ల్లో 1534 డాట్ బాల్స్ వేసి ఈ లిస్ట్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు.
- సునీల్ నరైన్: టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్లో 162 మ్యాచుల్లో 1478 డాట్ బాల్స్ వేశాడు.
- రవిచంద్రన్ అశ్విన్:ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ స్పిన్ మాయాజలంతో బ్యాటర్లను తికమక పెడుతుంటాడు. మొత్తం 197 మ్యాచ్‌ల్లో 1477 డాట్ బాల్స్ వేశాడు.
- పీయూష్ చావ్లా: ఈ లెగ్ బ్రేక్ బౌలర్ ఐపీఎల్ చరిత్రలో 181 మ్యాచ్‌ల్లో 1272 బాట్ బాల్స్ వేశాడు.
- హర్భజన్ సింగ్: సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 163 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 1268 డాట్ బాల్స్ సంధించాడు.
- అమిత్ మిశ్రా:భారత స్పిన్నర్లలో ఒకరైన అమిత్ మిశ్రా ఐపీఎల్లో స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ కెరీర్లో 154 మ్యాచ్‌ల్లో 1186 డాట్ బాల్స్ వేశాడు.
- రవీంద్ర జడేజా:టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో చెన్నై, గుజరాత్ లయన్స్, కొచ్చి టస్కస్ కేరళ జట్లు తరఫున కలిపి 226 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్లో జడ్డూ 1159 బంతుల్ని డాట్స్‌గా మలిచాడు.
- లసిత్ మలింగ: శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్లో తనదైన మార్క్ చూపించాడు. కెరీర్లో రిటైర్ అయ్యే దాకా ముంబయి ఇండియన్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. 122 మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించాడు. ఇక కెరీర్లో 1155 డాట్ బాల్స్ వేశాడు.
- ఉమేశ్ యాదవ్:భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన ఐపీఎల్ కెరీర్ లో 141 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 1147 డాట్ బాల్స్ సంధించాడు.
- యుజ్వేంద్ర చాహల్:స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో సక్సెస్‌పుల్ బౌలర్లలో ఒకడు. అతడి కెరీర్లో 145 మ్యాచ్‌లు ఆడి అందులో 1129 బంతులను డాట్స్‌గా మలిచాడు.